Telangana | తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు..!
Telangana | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధవారం రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, […]

Telangana |
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బుధవారం రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇదే పరిస్థితి ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో వరి ధాన్యం, ఇతర పంటలు నీట మునిగిన విషయం తెలిసిందే. రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అకాల వర్షాల కారణంగా మామిడి పంటకు కూడా తీవ్ర నష్టం కలిగింది.