రాజస్థాన్‌ ‘జన్‌ అక్రోశ్‌ యాత్ర’.. గంటలోనే నాలుక మల్లేసిన బీజేపీ

ఎన్నికల్లో లబ్ధికోసం కరోనా నిబంధనలకు తూట్లు విధాత: రాజస్థాన్‌లో ‘జన్‌ అక్రోశ్‌’ పేరుతో బీజేపీ చేపట్టిన యాత్రను కరోనా నేపథ్యంలో నిలిపేస్తున్నట్లు ప్రకటించిన గంట వ్యవధిలోనే లేదూ ఆ యాత్ర కొనసాగిస్తామని తెలిపింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ జన్‌ అక్రోశ్‌ యాత్రను చేపట్టింది. ఒక వైపు కరోనా విస్తరిస్తున్నదన్న భయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న పరిస్థితుల్లో బీజేపీ తన తీరే వేరన్నట్లు వ్యవహరిస్తున్నది. ప్రపంచ […]

రాజస్థాన్‌ ‘జన్‌ అక్రోశ్‌ యాత్ర’.. గంటలోనే నాలుక మల్లేసిన బీజేపీ
  • ఎన్నికల్లో లబ్ధికోసం కరోనా నిబంధనలకు తూట్లు

విధాత: రాజస్థాన్‌లో ‘జన్‌ అక్రోశ్‌’ పేరుతో బీజేపీ చేపట్టిన యాత్రను కరోనా నేపథ్యంలో నిలిపేస్తున్నట్లు ప్రకటించిన గంట వ్యవధిలోనే లేదూ ఆ యాత్ర కొనసాగిస్తామని తెలిపింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ జన్‌ అక్రోశ్‌ యాత్రను చేపట్టింది.

ఒక వైపు కరోనా విస్తరిస్తున్నదన్న భయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న పరిస్థితుల్లో బీజేపీ తన తీరే వేరన్నట్లు వ్యవహరిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా చైనా, అమెరికా, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్ తదితర యూరప్‌ దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని దేశ ప్రజలకు సూచించింది. ఈ నేపథ్యంలోంచే.. కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాహుల్ గాంధీకి లేఖ రాస్తూ.. కరోనా పరిస్థితుల్లో భారత్‌ జోడో యాత్రను నిలిపివేయాలని కోరారు.

రాజస్థాన్‌లో డిసెంబర్ 1 నుంచి చేస్తున్న జన్‌ అక్రోశ్‌ యాత్రను నిలిపివేస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ప్రకటించారు. ఆ తర్వాత గంట వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కరోనా జాగ్రత్తలతో యాత్ర కొనసాగిస్తామని రాజస్థాన్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పునియ తెలియజేయటం గమనార్హం.