Ram Charan | పారిస్ వివాహ వేడుక‌లో.. రాయ‌ల్ లుక్‌లో మెరిసిన రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న జంట‌

Ram Charan | మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌నలు కొద్ది రోజుల క్రితం పేరెంట్స్ ప్ర‌మోష‌న్ ద‌క్కించుకోగా, ప్ర‌స్తుతం వారి పాప‌తో క‌లిసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. క్లింకార రాకతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో త‌డిసి ముద్దవుతుంది. అయితే రీసెంట్‌గా రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించ‌గా, ఆ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్‌గా మారాయి. వారు ఎక్క‌డికి వెళుతున్నారు అని అందరిలో అనేక సందేహాలు ఉన్నాయి. అయితే వారు త‌మ స్నేహితుడు రోస్మిన్ […]

  • By: sn    latest    Sep 13, 2023 2:36 AM IST
Ram Charan | పారిస్ వివాహ వేడుక‌లో.. రాయ‌ల్ లుక్‌లో మెరిసిన రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న జంట‌

Ram Charan |

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌నలు కొద్ది రోజుల క్రితం పేరెంట్స్ ప్ర‌మోష‌న్ ద‌క్కించుకోగా, ప్ర‌స్తుతం వారి పాప‌తో క‌లిసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. క్లింకార రాకతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో త‌డిసి ముద్దవుతుంది. అయితే రీసెంట్‌గా రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించ‌గా, ఆ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్‌గా మారాయి.

వారు ఎక్క‌డికి వెళుతున్నారు అని అందరిలో అనేక సందేహాలు ఉన్నాయి. అయితే వారు త‌మ స్నేహితుడు రోస్మిన్ మాధవ్‌జీ వివాహానికి హాజరయ్యేందుకు పారిస్ కు వెళ్లిన‌ట్టు తెలిసింది. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియాలో తెలియ‌జేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.

ప్రియమైన రోజ్మిన్.. నీకు శుభాకాంక్షలు.. పారిస్ లో మీతో మరింత సరదగా గడిపాము అని త‌మ కామెంట్ సెక్ష‌న్ లో తెల‌ప‌డంతో వారు రోస్మిన్ వివాహం కోస‌మ‌ని పారిస్‌కి వెళ్లిన‌ట్టు అంద‌రు భావిస్తున్నారు. ఇక పెళ్లిలో రామ్ చ‌ర‌ణ్ కస్టమ్ మేడ్ లేత గోధుమ రంగు సూట్ ధరించి, గాగుల్స్ పెట్టుకొని రాయల్ లుక్ లో కనిపించారు.

ఇక ఉపాసన భారీ, క్లిష్టమైన గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ చేసిన రిచ్ బ్రౌన్ అనార్కలి సూట్ ధరించి చాలా అందంగా క‌నిపించింది. వారి డ్రెస్‌ని అటు స్టైలిష్ గానూ ఇటు సంప్రదాయంగానూ డిజైన్ చేయడంతో వెడ్డింగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మెగా ప్రిన్సెస్ క్లింకార పుట్టిన తర్వాత వీరద్దరూ లాంగ్ టూర్‌కి వెళ్ల‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం

ఇక రామ్ చరణ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా మారిన చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇందులో శ్రీకాంత్, హీరోయిన్ అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుండ‌గా, పారిస్ నుంచి రాగానే గేమ్ ఛేంజర్ సినిమా చివరి దశ షూటింగ్ లో పాల్గొనే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్ కానుండ‌గా, ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు.