సిరిసిల్ల: రంగుల గుట్ట రహస్యం తెలిసిందోచ్!
విధాత: ఎన్నో ఏండ్లుగా అద్బుత పర్వతంగా చెప్పుకొనే రంగుల గుట్ట రహస్యం తెలిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల సరిహద్దుల్లో రాశిగుట్ట ఉన్నది. ఆ గుట్టనే స్థానికులు రంగుల గుట్టగా పిలుస్తారు. ఎందుకంటే.. ఆ గుట్టపైకి పోగానే మనుషుల శీరీరం రంగులు మారుతుందని చెప్తారు. నిజంగానే ఈ గుట్ట ఎక్కిన వారి కాళ్లు, చేతులు రంగులు మారుతాయి. అందుకే ఈ గుట్టను మహత్యం గల రంగుల గుట్టగా చెప్తారు. ఈ గుట్ట రహస్యాన్నితెలుసుకోవటం కోసం […]

విధాత: ఎన్నో ఏండ్లుగా అద్బుత పర్వతంగా చెప్పుకొనే రంగుల గుట్ట రహస్యం తెలిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల సరిహద్దుల్లో రాశిగుట్ట ఉన్నది. ఆ గుట్టనే స్థానికులు రంగుల గుట్టగా పిలుస్తారు.
ఎందుకంటే.. ఆ గుట్టపైకి పోగానే మనుషుల శీరీరం రంగులు మారుతుందని చెప్తారు. నిజంగానే ఈ గుట్ట ఎక్కిన వారి కాళ్లు, చేతులు రంగులు మారుతాయి. అందుకే ఈ గుట్టను మహత్యం గల రంగుల గుట్టగా చెప్తారు.
ఈ గుట్ట రహస్యాన్నితెలుసుకోవటం కోసం చరిత్ర కారుడు రత్నాకర్ రెడ్డి పరిశోధన చేపట్టారు. రాశిగుట్ట పై భాగంలో లేటరైట్ శిలలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఆ రాళ్లు నీరు, గాలి, వాతావరణ పరిస్థితులతో ఆక్సీకరణం చెంది వాటిపై పొడి రూపంలో పలుచటి పొర పై కప్పుగా ఏర్పడుతుంది.
ఆ పొడి జాజు, పసుపు, నారింజ రంగులో ఉంటుంది. ఎవరైనా ఆ గుట్టను ఎక్కితే.. కాళ్లు, చేతులకు ఆ లేటరైట్ రంగుపొడి అంటి కాళ్లు చేతులు రంగులు మారుతాయి. ఇన్నేండ్లుగా ఓ అద్భుతంగా భావిస్తున్నది ఓ పదార్థ లక్షణమని తేలటం గమనార్హం.