హ‌య‌త్‌న‌గ‌ర్ రేప్‌ ఘ‌ట‌న‌.. ప్ర‌ధాన కార‌ణం స్మార్ట్‌ఫోన్‌

మాన‌వ‌త్వాన్ని మంట‌గ‌ల్పుతున్న మొబైల్‌! సెల్లు ప్రపంచం… అల్లుకున్న అబధ్రత! విధాత: పదో తరగతి అమ్మాయిని సాటి విద్యార్థులే కాటేసిన ఉదంతం వింటేనే వణుకు పుడుతున్నది. తోటి వారే కదా అని ఎవరినీ నమ్మే స్థితి లేదు. ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం మీద పడుతుందో తెలియని అభ‌ద్ర‌త అంతటా ఆవరించింది. ఇవ్వాళ… ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్‌ హస్తభూషణం అయ్యింది. దాన్ని వినియోగిస్తున్నవారికి అది ఏ రూపంలో ఉపయోగపడుతుందో ఊహించటం కష్టం. సాధారణ గృహిణి నుంచి యువత, పెద్దల […]

  • By: krs    latest    Nov 30, 2022 3:40 PM IST
హ‌య‌త్‌న‌గ‌ర్ రేప్‌ ఘ‌ట‌న‌.. ప్ర‌ధాన కార‌ణం స్మార్ట్‌ఫోన్‌
  • మాన‌వ‌త్వాన్ని మంట‌గ‌ల్పుతున్న మొబైల్‌!
  • సెల్లు ప్రపంచం… అల్లుకున్న అబధ్రత!

విధాత: పదో తరగతి అమ్మాయిని సాటి విద్యార్థులే కాటేసిన ఉదంతం వింటేనే వణుకు పుడుతున్నది. తోటి వారే కదా అని ఎవరినీ నమ్మే స్థితి లేదు. ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం మీద పడుతుందో తెలియని అభ‌ద్ర‌త అంతటా ఆవరించింది.

ఇవ్వాళ… ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్‌ హస్తభూషణం అయ్యింది. దాన్ని వినియోగిస్తున్నవారికి అది ఏ రూపంలో ఉపయోగపడుతుందో ఊహించటం కష్టం. సాధారణ గృహిణి నుంచి యువత, పెద్దల దాకా అందరూ స్మార్ట్‌ ఫోన్లనే వాడుతున్నారు.

నిజానికి వారికి మాట్లాడటానికి అయితే సాధారణ ఫోన్‌ సరిపోతుంది. కానీ స్మార్ట్‌ఫోన్‌ ఎందుకు వాడుతున్నారు? స్మార్ట్‌ ఫోన్‌ను ఒక స్టేటస్‌ సింబల్‌గా వాడుతున్న స్థితే ఎక్కువ. ఇక విద్యార్థినీ విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్‌ ఏ రూపంలోనూ అవసరం ఉండదు.

పది, ఇంటర్‌ విద్యార్థలకు స్మార్ట్‌ ఫోన్ల అవసరం ఏ రూపంలోనూ ఉండదు. ఇంజినీరింగ్‌ లాంటి ప్రొఫెషన్‌ కోర్సులు చదువుతున్న వారికి ఒక విధంగా ఉపయోగ పడవచ్చు. అంతే కానీ అవసరం ఉన్నా, లేకున్నా స్మార్ట్‌ ఫోన్ల వాడకం ఎంతటి అపకారాన్ని చేస్తుందో హయత్ నగర్‌ ఘటన తేటతెల్లం చేసింది.

హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నబాలికను ఆ పాఠశాలలో చదువుతున్న నలుగురు సహ విద్యార్థులు (అందులో ఒకడు 9వ తరగతి వాడు) తోడేళ్లుగా మారి లైంగిక దాడి చేశారు. వారలా ప్రవర్తించటానికి స్మార్ట్‌ ఫోనే కారణమని పోలీసుల విచారణలో తేలటం గమనార్హం.

ఈ విద్యార్థులంతా తమ తల్లిదండ్రుల స్మార్ట్‌ ఫోన్లను తీసుకొని ఊరి బయటకి పోయి నీలి చిత్రాలు చూసే అలవాటుకు బానిస అయ్యారు. చివరికి వారు తమ సహ విద్యార్థిగా ఉన్న బాలికపై కన్నేసి కాటు వేశారు. వారిలో ఆ వక్రబుద్ధి ప్రేరేపించబడటానికి స్మార్ట్‌ ఫోనే కారణమన్నది మరువరాదు.

ఇప్పటికైనా అందరూ ఆలోచించాలి. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగానికి వీలైనంతగా దూరం ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థులకు అందుబాటులో లేకుండా చూడటం చాలా అవసరం. మనకే కాదు, ఎవరికీ స్మార్ట్‌ ఫోన్‌ అవసరం కాదన్న విషయం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.