Mouse-Deer | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో అత్యంత అరుదైన మూషిక జింక ప్ర‌త్య‌క్షం.. వీడియో

Rare mouse-deer |  జింక‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ చూసే ఉంటారు. కనీసం మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో జింక‌లు ఉంటాయి. రెండు పొడ‌వాటి కొమ్ములు క‌లిగి ఉండి, శ‌రీరంపై చారలు ఉంటాయి. ఆ జింక‌ల‌ను చూస్తే ప్ర‌తి ఒక్క‌రూ వాటితో కాసేపు ఆడుకోవాల‌నుకుంటారు. అయితే అత్యంత అరుదైన మూషిక జింక మాత్రం ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కంగేర్ వ్యాలీ నేష‌న‌ల్ పార్కులో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇది ప‌ర్యాట‌కుల‌ను, జంతు ప్రేమికుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. కంగేర్ వ్యాలీ నేష‌న‌ల్ పార్కులో ఏర్పాటు […]

Mouse-Deer | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో అత్యంత అరుదైన మూషిక జింక ప్ర‌త్య‌క్షం.. వీడియో

Rare mouse-deer | జింక‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ చూసే ఉంటారు. కనీసం మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో జింక‌లు ఉంటాయి. రెండు పొడ‌వాటి కొమ్ములు క‌లిగి ఉండి, శ‌రీరంపై చారలు ఉంటాయి. ఆ జింక‌ల‌ను చూస్తే ప్ర‌తి ఒక్క‌రూ వాటితో కాసేపు ఆడుకోవాల‌నుకుంటారు.

అయితే అత్యంత అరుదైన మూషిక జింక మాత్రం ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కంగేర్ వ్యాలీ నేష‌న‌ల్ పార్కులో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇది ప‌ర్యాట‌కుల‌ను, జంతు ప్రేమికుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. కంగేర్ వ్యాలీ నేష‌న‌ల్ పార్కులో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు ఈ అరుదైన జీవి ఫోటోలు చిక్కాయి.

మ‌న దేశంలో మొత్తం 12 ర‌కాల జింక‌ల జాతులు ఉన్నాయ‌ని, వాటన్నింటిలో మూషిక జింక‌నే చాలా చిన్న‌ద‌ని కంగేర్ వ్యాలీ నేష‌న‌ల్ పార్కు డైరెక్ట‌ర్ ధ‌మ్‌షిల్ గ‌న్వీర్ వెల్ల‌డించారు. అయితే ఈ మూషిక జింక‌ను స్పాటెడ్ చెవ్రోటెయిన్ అని కూడా పిలుస్తార‌ని పేర్కొన్నారు.

ఈ అరుదైన మూషిక జింక‌లు.. సౌత్ ఆసియా, సౌత్ ఈస్ట్ ఆసియాలోని రెయిన్ ఫారెస్టుల‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తాయ‌ని తెలిపారు. ఈ ఇండియ‌న్ మౌస్ డీర్‌లు ఇత‌ర జంతువుల‌ను చూస్తే సిగ్గుతో పారిపోయే ఈ నిశాచ‌ర జింక‌ల గురించి ఇంకా స‌మ‌గ్ర అధ్య‌య‌నం జ‌ర‌గ‌లేద‌ని పార్కు డైరెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.

అడ‌వుల్లో కార్చిచ్చులు, అడ‌వుల ఆక్ర‌మ‌ణ‌లు, జంతువుల వేట వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ మూషిక జింక‌ల జాతి అంత‌రించిపోతున్న‌ద‌ని తెలిపారు. ఈ అరుదైన మూషిక జింకల జాతిని కాపాడుకోవడానికి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.