Rashmika | అయ్యయ్యో.. రష్మికకు సుకుమార్ అలా దొరికేశాడా?

Rashmika, Sukumar విధాత: ఒకరేమో క్రియేటివ్ దర్శకుడు. మరొకరేమో స్టార్ హీరోయిన్. అలాంటిది సుకుమార్ వంటి దర్శకుడు రష్మిక(Rashmika) వంటి స్టార్ హీరోయిన్‌కి దొరకడం ఏంటి? ఇంతకీ సుకుమార్ ఏం తప్పు చేస్తుంటే.. రష్మిక చూసి ఉంటుంది. అసలే సినిమా ఇండస్ట్రీ. ఈ రంగుల ప్రపంచంలో హీరో-హీరోయిన్, హీరోయిన్-దర్శకుడు, హీరోయిన్-నిర్మాతలపై రకరకాలుగా వార్తలు వినిపిస్తుంటాయి. అలాంటిదేమైనా ఉందా? అనే అనుమానాలు కూడా రావడం సహజమే. కానీ విషయం అది కాదు. సుకుమార్ కనుక తన తదుపరి ప్రాజెక్ట్‌లో […]

  • By: krs    latest    Apr 27, 2023 3:23 AM IST
Rashmika | అయ్యయ్యో.. రష్మికకు సుకుమార్ అలా దొరికేశాడా?

Rashmika, Sukumar

విధాత: ఒకరేమో క్రియేటివ్ దర్శకుడు. మరొకరేమో స్టార్ హీరోయిన్. అలాంటిది సుకుమార్ వంటి దర్శకుడు రష్మిక(Rashmika) వంటి స్టార్ హీరోయిన్‌కి దొరకడం ఏంటి? ఇంతకీ సుకుమార్ ఏం తప్పు చేస్తుంటే.. రష్మిక చూసి ఉంటుంది. అసలే సినిమా ఇండస్ట్రీ.

ఈ రంగుల ప్రపంచంలో హీరో-హీరోయిన్, హీరోయిన్-దర్శకుడు, హీరోయిన్-నిర్మాతలపై రకరకాలుగా వార్తలు వినిపిస్తుంటాయి. అలాంటిదేమైనా ఉందా? అనే అనుమానాలు కూడా రావడం సహజమే. కానీ విషయం అది కాదు.

సుకుమార్ కనుక తన తదుపరి ప్రాజెక్ట్‌లో అవకాశం ఇవ్వకుంటే.. తన దగ్గరున్న ఓ ఆడియోని లీక్ చేస్తానంటూ రష్మిక ఆటపట్టిస్తుందట. అది విషయం. ఇంతకీ రష్మిక దగ్గర ఉన్న ఆడియో ఏమిటని అనుకుంటున్నారా? సుకుమార్ ఒకానొక టైమ్‌లో రష్మిక దగ్గర ఇండస్ట్రీలోని హీరోయిన్ల గురించి కామెంట్స్ చేశాడట.

అతను మాట్లాడుతుండగా రష్మికా మందన్నా దానిని రికార్డ్ చేసిందట. హీరోయిన్ల గురించి సుకుమార్ మాట్లాడిన మాటలు కనుక బయటికి వస్తే.. ఆయన పరువు పోవడం ఖాయమనేలా ఉన్న ఆ ఆడియోతో రష్మిక ఆటపట్టింస్తుందనేలా ఆయన యూనిట్‌లోని కొందరు మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ సినిమా చేస్తున్నారు. ఈ సీక్వెల్‌కు సంబంధించి మొదట్లో రష్మికను సెకండ్ పార్ట్‌లో తీసుకోవడం లేదనేలా వార్తలు వచ్చాయి. కానీ, రష్మిక ఇందులో చేస్తుందనే విషయం ఇటీవల ఆమె సెట్స్‌లో అడుగుపెట్టినప్పుడే తెలిసిపోయింది.

ఈ ప్రాజెక్ట్‌లోనే కాకుండా.. సుకుమార్ తదుపరి చేయబోయే ప్రాజెక్ట్‌లో కూడా రష్మికా మందన్నానే హీరోయిన్‌గా ఉంటుందని అంటున్నారు. అందుకు కారణం.. రష్మిక దగ్గర ఉన్న ఆడియోనే అని టీమ్ మాట్లాడుకుంటున్న మాటలు బయటికి వచ్చేశాయి. దీంతో రష్మికకు సుకుమార్ భలే దొరికేశాడుగా! అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.