Vijay Deverakonda – Rashmika Mandanna | రష్మికను విజయ్‌ దేవరకొండ దూరం పెడుతున్నాడా?.. బర్త్‌ డే విషెష్ అందుకే చెప్పలేదా..?

Vijay Deverakonda - Rashmika Mandanna | చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమ, డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్‌ సాధారణమే. ఇందులో కొన్ని జంటలు మాత్రమే చివరకు తమ పెళ్లి బంధంతో రూమర్స్‌కు చెక్‌ పెడుతుండగా.. మరికొన్ని జంటలు మధ్యలోనే విడుపోతుంటాయి. వాస్తవానికి నటీనటులు ప్రేమలో ఉన్నా.. ఈ విషయాన్ని ఎంత దాచాలని ప్రయత్నించినా ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియా పుణ్యమాని కెమెరాలకు చిక్కితే.. ఇక ఈ అంశం హాట్‌ టాపిక్‌ […]

Vijay Deverakonda – Rashmika Mandanna | రష్మికను విజయ్‌ దేవరకొండ దూరం పెడుతున్నాడా?.. బర్త్‌ డే విషెష్ అందుకే చెప్పలేదా..?

Vijay Deverakonda – Rashmika Mandanna | చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమ, డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్‌ సాధారణమే. ఇందులో కొన్ని జంటలు మాత్రమే చివరకు తమ పెళ్లి బంధంతో రూమర్స్‌కు చెక్‌ పెడుతుండగా.. మరికొన్ని జంటలు మధ్యలోనే విడుపోతుంటాయి. వాస్తవానికి నటీనటులు ప్రేమలో ఉన్నా.. ఈ విషయాన్ని ఎంత దాచాలని ప్రయత్నించినా ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియా పుణ్యమాని కెమెరాలకు చిక్కితే.. ఇక ఈ అంశం హాట్‌ టాపిక్‌ అవ్వాల్సిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ జంట అయిన విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న గురించి ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. ఇద్దరు కలిసి ‘గీతా గోవిందం’ సినిమాలో జంటగా నటించగా.. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నది.

ఆ తర్వాత ఇద్దరు డియర్‌ కామ్రేడ్‌ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమగా మారిందని ప్రచారం జరిగింది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఇద్దరు కలిసి పలు సందర్భాల్లో మీడియాకు సైతం చిక్కారు. కానీ, ఇద్దరు మంచి ఫ్రెండ్స్‌ మాత్రమే అని చెప్పారు. అయితే, వీరిద్దరి ఫ్రెండ్స్‌ కాదని, ఇద్దరు ప్రేమించుకుంటున్నారని టాలీవుడ్‌ కోడై కూస్తున్నది. గతంలో ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్లారని, ఆ సమయంలో ఇద్దరు ఒకే చోట ఉన్నా.. వేర్వేరు వైపుల దిగిన ఫొటోలు దిగారని ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. రష్మిక సైతం విజయ్‌ ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫొటోలు సైతం వైరల్‌ అయ్యాయి. ఇద్దరు ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా ప్రేమ వ్యవహారంపై ప్రశ్నలు వస్తూనే ఉంటాయి.

ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరి లవ్‌కు బ్రేక్‌ పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం రష్మిక బర్త్‌ డే సందర్భంగా విజయ్‌ దేవరకొండ విషెష్‌ చెప్పలేదు. రష్మిక టాలీవుడ్‌ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. కానీ, విజయ్‌ దేవరకొండ మాత్రం ట్విట్టర్‌లో గానీ.. ఇన్‌స్టాలో గానీ విషెష్‌ చెప్పలేదు. అంతే కాకుండా రష్మిక తనకు వచ్చిన విషెస్ అన్ని స్టోరీగా చేయగా.. అందులో విజయ్‌ శుభాకాంక్షలు చెప్పినట్లుగా ఎనిపించలేదు. దాంతో విజయ్‌ రష్మికను దూరం పెడుతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇందులో నిజంగానే విడిపోయారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో యానిమల్‌ చిత్రంతో పాటు సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప-2, నితిన్‌కు జోడీగా మరోచిత్రంలో నటిస్తున్నది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘ఖుషీ’, ‘జనగనమన’ చిత్రంలో నటిస్తున్నాడు.