MP Komatireddy | బీసీల కోసం నల్గొండ సీటు త్యాగానికి సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

MP Komatireddy | 2న మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ విధాత: కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పూర్తి వివరాలను విశ్లేషించే క్రమంలో ఎన్నికల కమిటీ సెప్టెంబర్ 2న మరోసారి భేటీ కానుందని పార్టీ స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థుల సామాజిక వర్గాల వారీగా పూర్తి వివరాలు అందించాలని పీఈసీ కోరడంతో ఈ మేరకు పీసీసీ సభ్యుల వివరాలు అందించిందన్నారు. అవసరమనుకుంటే బీసీల […]

  • By: krs    latest    Aug 29, 2023 12:37 AM IST
MP Komatireddy | బీసీల కోసం నల్గొండ సీటు త్యాగానికి సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

MP Komatireddy |

  • 2న మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ

విధాత: కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పూర్తి వివరాలను విశ్లేషించే క్రమంలో ఎన్నికల కమిటీ సెప్టెంబర్ 2న మరోసారి భేటీ కానుందని పార్టీ స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థుల సామాజిక వర్గాల వారీగా పూర్తి వివరాలు అందించాలని పీఈసీ కోరడంతో ఈ మేరకు పీసీసీ సభ్యుల వివరాలు అందించిందన్నారు.

అవసరమనుకుంటే బీసీల కోసం నా నల్లగొండ సీటును వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఒక్కొక్క అభ్యర్థి వివరాలపై చర్చించాలని రేవంత్ ప్రతిపాదించారన్నారు. ఈ ప్రతిపాదనను అందరం ఆమోదించామన్నారు. సమర్థవంతమైన వాళ్లకే టికెట్లు ఇవ్వనున్ననట్లు తెలిపారు. అందరి బలాబలాలు పరిశీలిస్తున్నామన్నారు.

పీఈసీ సభ్యులతో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యుల జాయింట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ కు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ రానుందని, సెప్టెంబర్ మూడవ వారం లోగా కాంగ్రెస్ తొలి జాబితా వెల్లడవుతుందని భావిస్తున్నామని కోమటిరెడ్డి వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లను అమలు చేస్తామని, అమలు చేయకపోతే రాజీనామా చేస్తామన్నారు. కేసీఆర్ మూడెకరాలు ఇస్తామని మాట తప్పాడని, తలనరక్కుంటా అన్నాడని, ఏం చేశాడని ప్రశ్నించారు. మొండెంతో తిరుగుతున్నాడా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు. ఎన్నికల ముందు కేటీఆర్ అమెరికా టూర్ వెనక ఏదో మతలబు ఉందన్నారు.