RK Arora | సూప‌ర్‌టెక్ చైర్మ‌న్ ఆర్‌కే అరోరా అరెస్ట్

RK Arora | ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ కంపెపీ సూప‌ర్‌టెక్ య‌జ‌మాని, చైర్మ‌న్ ఆర్‌కే అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై అరోరాను మంగ‌ళ‌వారం రాత్రి అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. వ‌రుస‌గా మూడోసారి ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో అరోరాను విచారించిన అధికారులు, మ‌నీలాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టంలోని క్రిమిన‌ల్ సెక్ష‌న్ల కింద ఆయ‌న‌ను అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. వివిధ స్థిరాస్తి స్కీమ్‌ల పేరుతో డ‌బ్బులు వ‌సూలు చేయ‌డంపై ఈడీ విచారించిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి అరోరాను […]

RK Arora | సూప‌ర్‌టెక్ చైర్మ‌న్ ఆర్‌కే అరోరా అరెస్ట్

RK Arora |

ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ కంపెపీ సూప‌ర్‌టెక్ య‌జ‌మాని, చైర్మ‌న్ ఆర్‌కే అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై అరోరాను మంగ‌ళ‌వారం రాత్రి అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది.

వ‌రుస‌గా మూడోసారి ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో అరోరాను విచారించిన అధికారులు, మ‌నీలాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టంలోని క్రిమిన‌ల్ సెక్ష‌న్ల కింద ఆయ‌న‌ను అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. వివిధ స్థిరాస్తి స్కీమ్‌ల పేరుతో డ‌బ్బులు వ‌సూలు చేయ‌డంపై ఈడీ విచారించిన‌ట్లు స‌మాచారం.

మొత్తానికి అరోరాను బుధ‌వారం ప్ర‌త్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజ‌రు ప‌రిచి, త‌దుప‌రి విచార‌ణ కోసం రిమాండ్‌కు కోరే అవ‌కాశం ఉంది.

ఢిల్లీ, హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్‌లు దాఖ‌లు చేయ‌డంతో.. దాని ఆధారంగా సూప‌ర్‌టెక్ గ్రూప్, ఆ సంస్థ డైరెక్ట‌ర్లు, ప్ర‌మోట‌ర్ల‌పై ఈడీ మ‌నీలాండ‌రింగ్ కేసు న‌మోదు చేసింది. ఏప్రిల్ నెల‌లో ఈ స్థిరాస్తి గ్రూప్, ఆ సంస్థ డైరెక్ట‌ర్ల‌కు చెందిన దాదాపు రూ. 40 కోట్ల‌కు పైగా ఆస్తుల్ని ఈడీ అధికారులు అటాచ్ చేశారు.