Renuka Chaudhary | మోడీ ముందస్తుకు.. తెలంగాణ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు: రేణుకా చౌదరి
Renuka Chaudhary విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రధాని మోడీ ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఆమె మీడియాతో మాట్లాడుతు ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లు ఇద్దరు ఒక్కటేనని, తెలంగాణలో బీజేపీకి అడ్రస్ లేదని, కారు టైర్లలో గాలి లేదని ఆమె తనదైన శైలీలో ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ ఖమ్మం సభతో బీఆర్‌ఎస్, బీజేపీలలో భయం మొదలైందన్నారు. కాంగ్రెస్‌లో […]

Renuka Chaudhary
విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రధాని మోడీ ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఆమె మీడియాతో మాట్లాడుతు ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లు ఇద్దరు ఒక్కటేనని, తెలంగాణలో బీజేపీకి అడ్రస్ లేదని, కారు టైర్లలో గాలి లేదని ఆమె తనదైన శైలీలో ఎద్దేవా చేశారు.
రాహుల్‌గాంధీ ఖమ్మం సభతో బీఆర్‌ఎస్, బీజేపీలలో భయం మొదలైందన్నారు. కాంగ్రెస్‌లో భారీ చేరికలు ఉండబోతున్నాయని, రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 70-100సీట్లు కోల్పోనుందన్నారు. షర్మిల పాలేరు నుండి పోటీ చేస్తారన్న అంశంపై స్పందిస్తు ఆమె ఎవరో తనకు తెలియదన్నారు.