Revanth Reddy | సిట్‌ కార్యాలయానికి రేవంత్‌.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకుల అరెస్ట్‌

రాష్ట్రంలో ప్రజాపాలన లేదు.. పోలీసు రాజ్యమే ఇప్పటివరకు వేసిన సిట్‌లన్నీ ఏవీ లేచి నిలబడలేదని ఎద్దేవా ఇవాళ అడ్డుకుంటే రేపు వెళ్తాం.. సిట్‌ ముందు హాజరుకావాలని నోటీసులు ఎందుకు, అరెస్టులు ఎందుకు అసలు దోషులను పక్కనపెట్టే కుట్ర కేసీఆర్‌, కేటీఆర్‌కు తగిన గుణపాటం తప్పదు విధాత‌: టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన ఆరోపణలపై సిట్‌ స్పందించింది. తన వద్ద ఉన్న ఆధారాలతో ఇవాళ హాజరుకావాలని రేవంత్‌రెడ్డికి నోటీసులు […]

Revanth Reddy | సిట్‌ కార్యాలయానికి రేవంత్‌.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకుల అరెస్ట్‌
  • రాష్ట్రంలో ప్రజాపాలన లేదు.. పోలీసు రాజ్యమే
  • ఇప్పటివరకు వేసిన సిట్‌లన్నీ ఏవీ లేచి నిలబడలేదని ఎద్దేవా
  • ఇవాళ అడ్డుకుంటే రేపు వెళ్తాం..
  • సిట్‌ ముందు హాజరుకావాలని నోటీసులు ఎందుకు, అరెస్టులు ఎందుకు
  • అసలు దోషులను పక్కనపెట్టే కుట్ర
  • కేసీఆర్‌, కేటీఆర్‌కు తగిన గుణపాటం తప్పదు

విధాత‌: టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన ఆరోపణలపై సిట్‌ స్పందించింది. తన వద్ద ఉన్న ఆధారాలతో ఇవాళ హాజరుకావాలని రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్‌ జూబ్లీహల్స్‌ నివాసం నుంచి సిట్‌ కార్యాలయానికి బయలుదేరిన ఆయన వాహణ శ్రేణిని లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులు నిలిపివేశారు. కారు దిగి సిట్ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లారు.

రేవంత్‌ తన వాంగ్మూలాల ఆధారంగా టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై సాక్షం ఇవ్వడానికి తనను సిట్‌ కార్యాలయానికి రావాలని కోరారు. తన వద్ద ఉన్న ఆధారాలను ఆయన సిట్‌కు అందజేయనున్నారు. ఈ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై రేవంత్‌ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ముందు బీఆర్‌ఎస్‌ హైడ్రామాను చూశాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల నిరసనలను అణిచివేయడానికి యత్నిస్తున్నదని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.

పోలీసుల పాలనే.. ప్రజాపాలన లేదు- మల్లురవి

టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి (Mallu Ravi) మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతున్నదని.. ప్రజా పాలన లేదన్నారు. రేవంత్‌రెడ్డి సిట్‌ కు హాజరువుతున్నసందర్భంలో తనతో పాటు కాంగ్రెస్‌ నాయకులను అరెస్టులు, హౌజ్‌ అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వాళ్లందరినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అసలు దోషులను పక్కనపెట్టే కుట్ర- అద్దంకి దయాకర్‌

పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ (Addanki Dayakar) మాట్లాడుతూ..ఈ అరెస్టులు అక్రమం, అప్రజాస్వామికం అన్నారు. మా నాయకుడితోకలిసి మేమంతా సిట్‌ ముందుకు వెళ్దామని అనుకున్నాం. కానీ పోలీసులు ఈ విధంగా అక్రమ అరెస్టులతో తమను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అంతేకాదు నేరస్థులను పక్కన పెట్టి మా పీసీసీ అధ్యక్షుడు, ఎంపీకి సిట్‌ సమన్లు ఇవ్వడం ప్రభుత్వ తీరుకు ఉదాహరణ అన్నారు. ఈ సిట్‌ లు అన్ని సిట్‌లే ఏవీ లేచి నిలబడలేదన్నారు. నయీం కేసు గాని, డ్రగ్స్‌ మీద వేసిన అకున్‌ సబర్వాల్‌ సిట్‌ కాని అన్నీ బుట్టదాఖలయ్యాయని ఆయన గుర్తు చేశారు. అసలు దోషులను పక్కనపెట్టే కుట్ర జరుగుతున్నదని, దీనిపై నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్‌ పోరాడుతుందన్నారు.

కేసీఆర్‌,కేటీఆర్‌లకు తగిన గుణపాఠం చెప్తాం-సునీతారావు

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు (Sunita Rao) మాట్లాడుతూ..గృహనిర్బంధం చేయడం… ప్రజాస్వామ్యంలో మాట్లాడకుండా గొంతునొక్కడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రతిపక్షాలు బైటకి రాకుండా గృహనిర్బంధం చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్‌,మంత్రి కేటీఆర్‌లకు తప్పకుండా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈరోజు వెళ్లకుంటే రేపు వెళ్తామని ప్రభుత్వ తీరుపై ఆమె ధ్వజమెత్తారు.

టీఎస్‌పీస్సీ ప్రశ్న పత్రం లీకేజీ చేసి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాను రోడ్డుమీదికి తెచ్చిన సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ను సస్పెండ్‌ చేయాలని, బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తున్న తమ గొంతును నొక్కే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్నదని అందుకే ముందస్తు అరెస్టులు చేయడాన్ని నేతలు ఖండించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని బీఆర్‌ఎస్‌ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు.