ఎంపీ పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా
తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపధ్యంలో రేవంత్‌రెడ్డి బుధవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు

- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందచేత
విధాత : తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపధ్యంలో రేవంత్‌రెడ్డి బుధవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కొడంగల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన రేవంత్‌రెడ్డి సీఎల్పీ నేతగా ఎంపికై కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా రేపు గురువారం ప్రమాణా స్వీకారం చేయబోతున్నారు. దీంతో నిబంధనల మేరకు రేవంత్ రెడ్డి తన మల్కాజ్‌గిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందచేశారు. అటు రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ నూతన శాసన సభకు నల్లగొండ, హుజూర్‌నగర్‌ల నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపికైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా తమ ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 50మంది ఎంపీల బలంలో తెలంగాణ నుంచే ముగ్గురు ఎంపీల సంఖ్య తగ్గిపోనుండటం గమనార్హం.