ఆరుగురు మంత్రులతోనే రేవంత్‌ ప్రమాణాస్వీకారం

రేపు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ఆరుగురు మంత్రులు మాత్రమే ప్రమాణాస్వీకారం చేయనున్నారని కాంగ్రెస్‌ వర్గాల కథనం. అసెంబ్లీ స్పీకర్‌ ఎవరన్నది తేలాకే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి

  • By: Somu    latest    Dec 06, 2023 10:13 AM IST
ఆరుగురు మంత్రులతోనే రేవంత్‌ ప్రమాణాస్వీకారం
  • కేసీఆర్‌, చంద్రబాబులకు ఆహ్వానం


విధాత : రేపు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ఆరుగురు మంత్రులు మాత్రమే ప్రమాణాస్వీకారం చేయనున్నారని కాంగ్రెస్‌ వర్గాల కథనం. అసెంబ్లీ స్పీకర్‌ ఎవరన్నది తేలాకే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు ఢిల్లీలోనే ఉన్న రేవంత్‌రెడ్డి మంత్రివర్గం కూర్పుపై ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌లతో చర్చించారు. మరోవైపు సీఎం కుర్చీ ఆశించిన ఉత్తమ్‌, భట్టిలు మంత్రివర్గం కూర్పుపై తమ అభిప్రాయలను పార్టీ పరిశీలకుడు డీకే శివకుమార్‌కు వివరించారు.


మంత్రులుగా ఎవరెవరు ఉండాలి..ఎవరెవరకి ఏయే శాఖలుంటే బాగుంటుందన్నదానిపై ఉత్తమ్‌, భట్టిలు కొన్ని డిమాండ్లను డీకే శివకుమార్‌ ముందుంచినట్లుగా తెలుస్తుంది. రేపు ఎల్‌బీ స్టేడియంలో రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రమాణా స్వీకారం చేయబోతున్నారు. కాగా సీఎంగా తన పదవి ప్రమాణాస్వీకారోత్సవానికి ఇప్పటికే ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించిన రేవంత్‌ రెడ్డి ఇటు మాజీ సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డిలను కూడా ఆహ్వానించారు.