RGV | వర్మని బట్టలూడదీసి కొడతాం.. ఆర్జీవికి గిడుగు వార్నింగ్!
RGV | విధాత: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జగన్ మోహన్ రెడ్డి బయో పిక్చర్ గా రూపొందుతున్న 'వ్యూహం' చిత్రం అప్పుడే ఆంధ్రాలో అగ్గి రాజేస్తోంది. నిన్న టీజర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ ఆ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. ఇది ఎన్నికల ముందు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా, కార్యకర్తలు దాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వైఎస్సార్ మరణం, ఆ తరువాత జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడం.. […]

RGV |
విధాత: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జగన్ మోహన్ రెడ్డి బయో పిక్చర్ గా రూపొందుతున్న ‘వ్యూహం’ చిత్రం అప్పుడే ఆంధ్రాలో అగ్గి రాజేస్తోంది. నిన్న టీజర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ ఆ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. ఇది ఎన్నికల ముందు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా, కార్యకర్తలు దాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
వైఎస్సార్ మరణం, ఆ తరువాత జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడం.. ఓదార్పు యాత్ర చేపట్టడం.. సీబీఐ కేసులు.. అరెస్ట్, జైలు జీవితం ఇవన్నీ ఈ సినిమాలో ఉంటాయని అంటున్నారు. అదే విధంగా ఆనాడు జగన్ను ఇబ్బంది పెట్టిన సోనియా, ఇతర కాంగ్రెస్ నాయకుల పాత్రలతో బాటు చంద్రబాబు పాత్రధారి సైతం ఈ సినిమాలో ఉంటారని అంటున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ సినిమా మీద విమర్శలు ఎక్కుబెడుతోంది.
పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. వ్యూహం సినిమాలో సోనియాగాంధీని చెడుగా చూపిస్తే వర్మని బట్టలూడదీసి కొడతాం అని హెచ్చరించారు. ఆయనకు ఆనాడు జరిగిన సంఘటనల వెనుక వాస్తవాలు తెలుసా? తెలియకుండా ఏదేదో సొంతంగా ఊహించుకుని సోనియాగాంధీని తప్పుగా చూపించే ప్రయత్నం చూస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.
మొత్తానికి రాష్ట్రంలో ఉందా లేదా అన్నట్లుగా ఉన్న కాంగ్రెస్ కు అధ్యక్ష పదవిని ఇచ్చినందుకు కృతజ్ఞతగా రుద్రరాజు ఆమె తరఫున మాట్లాడడం సమంజసమే అని అంటున్నారు. మరోవైపు ఆర్జీవీ ఇలాంటి బెదిరింపులకు లొంగేరకం కాదని , మాఫియా డాన్స్ ను సైతం ఆయన ఇంటర్వ్యూలు చేసారని, ఆయన అనుకున్న కథ ప్రకారమే సినిమా తీస్తారు తప్ప ఎవరో బెదిరిస్తే వెనక్కి తగ్గే రకం కాదని అంటున్నారు.