Roja | చిక్కుల్లో రోజా భ‌ర్త‌.. సెల్వ‌మ‌ణికి నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారీ

Roja | సినీ నటి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా భర్త సెల్వమణి చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న భ‌ర్తకి అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2016లో ఓ తమిళ ఛానెల్‌కి సెల్వమణి ఇంటర్వ్యూ ఇవ్వ‌గా, అందులో తనని కించపరిచేలా సెల్వమణి వ్యాఖ్యలు చేశారని ఓ సినీ ఫైనాన్షియర్ ప‌రువు న‌ష్టం కేసు వేశాడు. జార్జి టౌన్ కోర్టులో ఈ పరువునష్టం దావా నడుస్తుండ‌గా, కేసు విచార‌ణ‌కి ద‌ర్శ‌కుడు సెల్వ‌మ‌ణి హాజ‌రు కాక‌పోవ‌డంతో కోర్ట్ […]

  • By: sn    latest    Aug 29, 2023 2:59 PM IST
Roja | చిక్కుల్లో రోజా భ‌ర్త‌.. సెల్వ‌మ‌ణికి నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారీ

Roja |

సినీ నటి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా భర్త సెల్వమణి చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న భ‌ర్తకి అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2016లో ఓ తమిళ ఛానెల్‌కి సెల్వమణి ఇంటర్వ్యూ ఇవ్వ‌గా, అందులో తనని కించపరిచేలా సెల్వమణి వ్యాఖ్యలు చేశారని ఓ సినీ ఫైనాన్షియర్ ప‌రువు న‌ష్టం కేసు వేశాడు.

జార్జి టౌన్ కోర్టులో ఈ పరువునష్టం దావా నడుస్తుండ‌గా, కేసు విచార‌ణ‌కి ద‌ర్శ‌కుడు సెల్వ‌మ‌ణి హాజ‌రు కాక‌పోవ‌డంతో కోర్ట్ నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇది సెల్వమణికి బిగ్ షాక్ కాగా, ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 22న జరగనుంది. కాగా, సెల్వమణి ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అయితే వివాదం ఏంటంటే.. తమిళ సినిమాలకు ఫైనాన్స్ చేసే ప్రముఖ ఫైనాన్షియర్ ముకుంద్ చాంద్ బోత్రా 2016లో ఓ కేసు విష‌యంలో అరెస్ట్ కావడం ఆ తర్వాత విడుదల కావడం జరిగింది. అదే టైంలో ఆర్కే సెల్వమణి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరుళ్ అంబరాసుతో కలసి ఓ టివి ఛానల్ కి సంబంధించిన‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో ముకుంద్ పై సెల్వ‌మ‌ణి పలు ఆరోపణలు చేశారు. ముకుంద్ తనని కూడా చాలా ఇబ్బంది పెట్టాడని సెల్వమణి ఆరోపించారు. ఈ క్ర‌మంలో సెల్వమణి తన పరువుకు భంగం కలిగించే విధంగా ఆరోప‌ణ‌లు ఉన్నాయంటూ ముకుంద్ పరువునష్టం కేసు ఫైల్ చేసారు.

సెల్వమణికి తనకి ఎలాంటి సంబంధం లేక‌పోయిన కూడా ఆయ‌న త‌న‌పై లేనిపోని ఆరోపణలు చేశారని ముకుంద్ మండిపడ్డారు. జార్జ్ టౌన్ లోని ఎక్స్వి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సెల్వమణిపై కేసు నమోదు చేయడంతో ఈ వివాదం త‌లెత్తింది.

అయితే ఈ కేసు న‌మోదు చేసిన త‌ర్వాత ముకుంద్ చాంద్ మరణించినప్పటికీ ముకుంద్ తనయుడు మాత్రం వదిలిపెట్టడం లేదు. సెల్వమణికి వ్యతిరేకంగా కేసు కొనసాగిస్తున్నాడు.మ‌రి కేసులో చివ‌రికి ఎలాంటి నిర్ణ‌యం వ‌స్తుందో చూడాలి.