IT Seized: ఆ.. రూ. 22 కోట్లు అంతే సంగతులు!

గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పట్టుబడిన రూ.22కోట్ల కోసం ఎవరు రాకపోవడంతో ఐటీ అధికారులు వాటిని సీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. బినామీ యాక్ట్ కింద రూ.22 కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లుగా ఐటీ అధికారులు తెలిపారు.

IT Seized: ఆ.. రూ. 22 కోట్లు అంతే సంగతులు!

IT seized: గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పట్టుబడిన రూ.22కోట్ల కోసం ఎవరు రాకపోవడంతో ఐటీ అధికారులు వాటిని సీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. బినామీ యాక్ట్ కింద రూ.22 కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లుగా ఐటీ అధికారులు తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐటీ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

నవంబర్ 2023లో గచ్చిబౌలిలో ఐదు కోట్లు సీజ్ చేశారు. 2023 జూన్ లో మూడు కోట్లు సీజ్ చేశారు. మొత్తం తొమ్మిది కేసుల్లో రూ. 22 కోట్లు సీజ్ చేశారు. బాచుపల్లి, గచ్చిబౌలి, హయత్ నగర్, కవాడిగూడా, కాచిగూడల్లో కోట్ల రూపాయల డబ్బు పట్టుబడింది. పట్టుబడిన రూ. 22 కోట్ల డబ్బును క్లెయిమ్ చేసుకునేందుకు యజమానులు ఎవరు ముందుకు రాలేదు.

దీంతో బినామీ యాక్ట్ కింద రూ.22 కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లుగా ఐటీ అధికారుల పేర్కొన్నారు. అదంతా బ్లాక్ మనీ కావడం..ఆ డబ్బు మాదే అని వెళితే అందుకు సంబంధించిన లెక్కలు చూపాల్సి వస్తుందని..లేకపోతే లేనిపోని కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో ఆ డబ్బు కోసం ఎవరు రానట్లుగా ఐటీ అధికారుల భావిస్తున్నారు.