తెలంగాణలో ప్రభుత్వం ఉందా.. జాడ చెప్పండి
సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో ఆర్భాటంగా ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు అందించిన 614 మంది ఎక్సైజు కానిస్టేబుళ్లు ట్రైనింగ్ కు పోకుండా గత నలభై రోజుల నుండి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆరెస్.ప్రవీణ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు

- బీఆరెస్ నేత ఆరెస్పీ ట్వీట్
- త్రిశంకు స్వర్గంలో 614మంది ఎక్సైజ్ కానిస్టేబుల్స్
విధాత : సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో ఆర్భాటంగా ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు అందించిన 614 మంది ఎక్సైజు కానిస్టేబుళ్లు ట్రైనింగ్ కు పోకుండా గత నలభై రోజుల నుండి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆరెస్.ప్రవీణ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నా చేతిలో ఏంలేదు ప్రభుత్వాన్ని అడగమని బాధితులతో అంటున్నారని ఆరోపించారు.
అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా? అని అది కనిపిస్తే దయచేసి దాని జాడ చెప్పండంటూ ఆరెస్పీ తన ట్వీట్‌లో ప్రభుత్వానికి చురకలేశారు. 614మంది ఎక్సైజ్ కానిస్టేబుల్స్‌ను ఏప్రీల్ 13వ తేదీలోగా జాయినింగ్ రిపోర్టు చేయాలని తమకు ఇచ్చిన నియామక ఉత్తర్వుల్లో పేర్కోన్నారని, కాని వారికి ఎక్కడా పోస్టింగ్‌లు కేటాయించలేదని, జాయినింగ్ రిపోర్టు ఇవ్వడానికి చేస్తున్న ఉద్యోగాల నుంచి కూడా రిలీవ్ అయ్యారని, ఇప్పుడు వారి భవితవ్యం ఏమిటో అర్ధం కావడం లేదని ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వెంటనే ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టింగ్, జాయినింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆరెస్పీ డిమాండ్ చేశారు.