RS Praveen Kumar | సిర్పూర్ నుంచే పోటీ చేస్తా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయంపై ప్రవీణ్ కుమార్ స్పష్టతనిచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. కాగజ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష, […]

RS Praveen Kumar | బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయంపై ప్రవీణ్ కుమార్ స్పష్టతనిచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. కాగజ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు.
సిర్పూర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష, పార్టీ అధినేత్రి మాయావతి ఆదేశాల మేరకు సిర్పూర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ సిర్పూర్‌లో ఆంధ్రా పాలనే కొనసాగుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన బంధువులకే కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నారని, భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. కోనప్ప పాలనకు చరమగీతం పలకాలన్న సంకల్పంతోనే ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
బీఎస్పీ అధికారంలోకి వస్తే మాలీలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు కృషి చేస్తానని ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం స్థానిక కార్మికులకు తక్కువ, స్థానికేతరులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తూ తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఓ ఆదివాసీపై బీజేపీ నాయకుడు మూత్ర విసర్జన చేశారని అందుకు నిరసనగా ఆదివాసీలందరూ ఆ పార్టీకి ఓటు వేయొద్దని ప్రవీణ్ కుమార్ కోరారు.