సల్మాన్ ‘బాయ్ జాన్’.. కాటమరాయుడు రిమేకా..!
విధాత: ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా కిసికా బాయ్ కిసికా జాన్ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో సీనియర్ హీరో వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో వెంకీ, పూజ అన్నా చెల్లెలుగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన సినిమా టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేశారు. పూజా హెగ్డే బతుకమ్మ […]

విధాత: ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా కిసికా బాయ్ కిసికా జాన్ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో సీనియర్ హీరో వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో వెంకీ, పూజ అన్నా చెల్లెలుగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన సినిమా టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేశారు. పూజా హెగ్డే బతుకమ్మ ఎత్తినట్టు చూపించారు. పక్కనే వెంకటేశ్‌కూడా బతుకమ్మతో నడుచుకుంటూ వెళుతున్న సీన్లు చూపించారు. మొత్తంగా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా టీజర్ ఉందని అర్థమవుతుంది. దీంతో అభిమానులు కథపై ఒక అవగాహనకు వచ్చారు. ముందు నుంచి ఇది కాటమ రాయుడు రీమేక్ అని ప్రచారం జరుగుతుండగా అదే నిజమని రుజువు అయింది.
తమిళంలో అజిత్ నటించిన వీరం చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా, కన్నడలో దర్శన్ ఓడయ్యా పేరుతో తెరకెక్కించి బోల్తా కొట్టారు. కేవలం తమిళనాడులో మాత్రమే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీన్నే చాలా మార్పులు చేసి సల్మాన్‌తో హిందీ వర్షన్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.
ఇందులో పూజ హెగ్డే అన్నయ్యగా వెంకటేష్ నటించాడు. ఈ పాత్ర ఒరిజినల్ వెర్షన్‌లో తండ్రి పాత్ర స్థానంలో అన్నయ్య పాత్రగా మార్చారు. సల్మాన్ పక్కన ముగ్గులు తమ్ముళ్లు మాత్రమే వీరంతో ప్రధాన పోలిక. పైగా బాయ్ జూలపాల జుట్టు మీసంతో ఒకసారి, క్లీన్ షేవ్‌తో మరోసారి ఇలా రెండు షేడ్స్‌లో దర్శనమిచ్చారు.
ఇవన్నీ చూస్తుంటే సందేహాలు అయితే వస్తున్నాయి. కాటమరాయుడుకు ఇది రీమేక్ అని తేటతెల్లమైంది. ఈ సస్పెన్స్ తీరాలంటే రంజాన్ దాకా ఆగాల్సిందే. ఇక పూజా హెగ్డే, వెంకటేష్, జగపతిబాబులు నటిస్తుండడం వల్ల దీనిపై తెలుగు ఆడియన్స్‌లో కూడా ఆసక్తి నెలకొని ఉంది.