గాంధీ వైద్యుల‌కు సెల్యూట్: సీఎం కేసీఆర్

విధాత: గాంధీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో 16 ఫీట్ల ఎత్తులో మ‌హాత్ముడి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. గాంధీ హాస్పిట‌ల్‌లో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం గొప్ప‌ విష‌యం. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించింది. క‌రోనా సోకిన వారి ప్రాణాల‌ను గాంధీ వైద్యులు కాపాడారు. గాంధీ వైద్యులు, సిబ్బంది, నర్సులు అంద‌రూ కూడా గాంధీ ఆద‌ర్శాన్ని పుణికి పుచ్చుకున్నారు. మ‌హ‌మ్మారి మీద యుద్ధం చేశారు. ప్రైవేటు ఆస్ప‌త్రులు రిజెక్టు చేసినా కూడా గాంధీ వైద్యులు అక్కున చేర్చుకుని ప్రాణాలు […]

  • By: krs    latest    Oct 02, 2022 7:02 AM IST
గాంధీ వైద్యుల‌కు సెల్యూట్: సీఎం కేసీఆర్

విధాత: గాంధీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో 16 ఫీట్ల ఎత్తులో మ‌హాత్ముడి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. గాంధీ హాస్పిట‌ల్‌లో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం గొప్ప‌ విష‌యం. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించింది. క‌రోనా సోకిన వారి ప్రాణాల‌ను గాంధీ వైద్యులు కాపాడారు.

గాంధీ వైద్యులు, సిబ్బంది, నర్సులు అంద‌రూ కూడా గాంధీ ఆద‌ర్శాన్ని పుణికి పుచ్చుకున్నారు. మ‌హ‌మ్మారి మీద యుద్ధం చేశారు. ప్రైవేటు ఆస్ప‌త్రులు రిజెక్టు చేసినా కూడా గాంధీ వైద్యులు అక్కున చేర్చుకుని ప్రాణాలు కాపాడారు. గాంధీ ఆస్ప‌త్రి వైద్యుల‌కు సెల్యూట్. ఒక మంచి ప‌ని చేస్తే ఎన్నో ప్ర‌శంస‌లు వ‌స్తాయి.

ఈ ప్ర‌పంచంలో ఉన్న‌ స‌మ‌స్త మాన‌వాళి ఆరోగ్యంతో పురోగ‌మించాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు ఉంది. గాంధీ పుట్టిన దేశంలో మ‌నంద‌రం పుట్ట‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంది. స‌మ‌స్త మాన‌వాలి సుఖంగా జీవిస్తున్నారంటే గాంధీనే కార‌ణం. అంత‌టి మ‌హాత్ముడు పుట్టిన‌టువంటి మ‌నంద‌రం కూడా ధ‌న్యులం. గాంధీ స్వాతంత్య్ర పోరాటాన్ని స‌వాల్‌గా స్వీక‌రించారు.

గాంధీ గారు ఆనాడు రాచ‌రిక వ్య‌వ‌స్థ ఉన్న సంద‌ర్భంలో పోరాటం చేశాడు. ద్వేషించే మాన‌వాళికి గొప్ప మార్గాన్ని చూపించాడు. బ్రిటీష్ వారి వ‌ద్ద తుపాకులు ఉన్నాయ‌ని అడిగితే.. ఒక సిద్ధాంత ప‌రంగా ముందుకెళ్లి బాపూజీ స్వాతంత్య్రం సాధించాడని అన్నారు.