Samantha: ఇది కదా సమంత క్రేజ్ అంటే.. సినిమాలు చేయకపోయినా టాప్ హీరోయిన్స్ అందరికీ ఝలక్ ఇచ్చేసింది..!
Samantha: ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ సమంత. తన కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల సమంత లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంది. యశోద చిత్రంతో మంచి హిట్ అందుకున్న సమంత శాకుంతలం చిత్రంతో నిరాశపరచింది. ఇక రీసెంట్‌గా విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమాతో పాటు సిటాడెట్ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసి ఇప్పుడు రెస్ట్ మోడ్‌లోకి […]

Samantha: ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ సమంత. తన కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల సమంత లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంది. యశోద చిత్రంతో మంచి హిట్ అందుకున్న సమంత శాకుంతలం చిత్రంతో నిరాశపరచింది. ఇక రీసెంట్‌గా విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమాతో పాటు సిటాడెట్ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసి ఇప్పుడు రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఏడాది పాటు సినిమాలకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది.
ఇటీవల సమంత పెద్దగా సినిమాలు చేయకపోయిన కూడా ఇప్పుడు అందరు హీరోయిన్స్ ఉలిక్కిపడేలా చేసింది. ఆర్మాక్స్ ఎప్పటికప్పుడు మన దేశంలో నెంబర్ హీరో.. హీరోయిన్ అనే దానిపై సర్వేలు చేస్తూ ఉంటుంది. ఒక్కో భాషకి సంబంధించి సర్వేలు చేసి లిస్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా జూన్ నెలకి సంబంధించి సర్వేని విడుదల చేయగా, మన దేశంలోనే మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్‌గా సమంత నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, సౌత్ లేడీ సూపర్ స్టార్స్ వంటి వారందరిని కూడా వెనక్కి నెట్టి సమంత మొదటి స్థానంలో నిలవడం విశేషం.
ఎక్కువ మంది ప్రేమించిన కథానాయికగా, మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ జాబితాలో సమంతకి తొలి స్థానం దక్కడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌గా ఉన్నారు. సమంత క్రేజ్ ముందు దీపికా పదుకొనె, అలియాభట్, కియారా, నయనతార, త్రిష, రష్మిక మందన్నా, కత్రినా కైఫ్, కాజల్, కీర్తిసురేష్‌లు కూడా వెనకబడిపోయారు. టాప్ 10 హీరోయిన్ల జాబితా చూస్తే .. సమంతది ఫస్ట్ ప్లేస్ కాగా, అలియా భట్ రెండో స్థానంలో, దీపికా పదుకొనె మూడో స్థానంలో, నయనతార నాలుగు, కాజల్ ఐదు, త్రిష ఆరు, కత్రినా ఏడు, కియారా ఎనిమిది, కీర్తిసురేష్ తొమ్మిది. కాగా నేషనల్ క్రష్ రష్మిక పదో స్థానంలో ఉండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది.