Samantha | విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి కాబోయే భార్య క్వాలిటీస్ స‌మంత చెప్ప‌డ‌మేంటి..!

Samantha | రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం ఖుషి.సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చివ‌రి చిత్రం లైగ‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణ‌మైన డిజాస్ట‌ర్ చ‌విచూసింది. ఇక స‌మంత న‌టించిన శాకుంత‌లం మూవీ కూడా దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. దీంతో ఈ ఇద్ద‌రికి ఇప్పుడు ఖుషి సినిమా కీల‌కం కానుంది. ఈ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి […]

  • By: sn    latest    Aug 17, 2023 3:47 AM IST
Samantha | విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి కాబోయే భార్య క్వాలిటీస్ స‌మంత చెప్ప‌డ‌మేంటి..!

Samantha |

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం ఖుషి.సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చివ‌రి చిత్రం లైగ‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణ‌మైన డిజాస్ట‌ర్ చ‌విచూసింది. ఇక స‌మంత న‌టించిన శాకుంత‌లం మూవీ కూడా దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. దీంతో ఈ ఇద్ద‌రికి ఇప్పుడు ఖుషి సినిమా కీల‌కం కానుంది.

ఈ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాల‌నుకుంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ, స‌మంత మూవీ ప్ర‌మోష‌న్స్ లోను జోరుగా పాల్గొంటున్నారు. ఇటీవ‌ల జరిగిన మ్యూజిక్ కాన్స‌ర్ట్ ఈవెంట్‌లో స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన ర‌చ్చ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. విజ‌య్ త‌న ష‌ర్ట్ విప్పి స‌మంత‌ని ఎత్తుకొని తిప్ప‌డం, అలానే ఆమెతో చాలా క్లోజ్‌గా ఉండడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

ఇక ఇదిలా ఉంటే ఖుషీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా విజ‌య్ దేవరకొండ, సమంత వరుసగా ఈవెంట్లు.. ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా, ఆ ఇంట‌ర్వ్యూలో విజయ్ గురించి సమంత.. సమంత గురించి విజయ్ కు ప‌లు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈక్రమంలోనే విజయ్ కాబోయే భార్య ఎలా ఉండాలో స‌మంత చెప్పుకు రాగా, ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. విజయ్ కు కాబోయే భార్య చాలా సింపుల్ గా ఉండాలి.. అతని కుటుంబంలో కలిసి పోవాలి.. వారిలో ఒకరిగా ఉండాలని చెప్పుకొచ్చింది స‌మంత‌. దానికి విజయ్ కూడా అంగీక‌రించాడు.

ఇక స‌మంత .. విజ‌య్ ఫోన్ తక్కువ మాట్లాడతాడని.. ఎక్కువ మెసేజ్ లు చేస్తాడని పేర్కొంది. అంతేకాక విజయ్ కు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ.. గేమింగ్ యాప్స్ బాగా ఉపయోగిస్తాడని కూడా తెలియ‌జేసింది.ఇక స‌మంత గురించి చెప్పుకొచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ.. రాహుల్, చిన్మయి, నీరజ కోన, మేఘన ఇలా సమంత కు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నార‌ని పేర్కొన్నాడు.

ఇక సమంతకు రకరకాల వంటలు ఆస్వాదించడమంటే చాలా ఇష్టమ‌ని చెప్పుకొచ్చాడు. ఎలాంటి విష‌యంలో అయిన స‌రే చాలా బ్యాలెన్స్డ్ గా ఉండే స‌మంత‌ కోపం వచ్చినా కూడా అసభ్యంగా మాట్లాడదని సమంత గురించి విజయ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.