Samantha | షర్టు విప్పి స‌మంత‌తో నానా ర‌చ్చ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇద్దరిపై దారుణ‌మైన ట్రోల్స్

Samantha | వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించిన కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గలేదు. ఆయ‌న సినిమా అంటే అభిమానులలో చాలా ఆస‌క్తి ఉంటుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రధాన పాత్ర‌లో స‌మంత హీరోయిన్ గా తెర‌కెక్కిన చిత్రం ఖుషి. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానుండ‌గా, మూవీ ప్ర‌మోష‌న్స్ జోరందుకున్నాయి. అయితే ఎలాంటి కంటెంట్ సినిమా చేసిన కూడా తనదైన మార్క్ ప్ర‌మోష‌న్ చేసి అంద‌రి అటెన్ష‌న్ త‌న వైపుకి తిప్పుకోవ‌డం విజ‌య్ దేవ‌రకొండ […]

  • By: sn    latest    Aug 16, 2023 4:08 PM IST
Samantha | షర్టు విప్పి స‌మంత‌తో నానా ర‌చ్చ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇద్దరిపై దారుణ‌మైన ట్రోల్స్

Samantha |

వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించిన కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గలేదు. ఆయ‌న సినిమా అంటే అభిమానులలో చాలా ఆస‌క్తి ఉంటుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రధాన పాత్ర‌లో స‌మంత హీరోయిన్ గా తెర‌కెక్కిన చిత్రం ఖుషి. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానుండ‌గా, మూవీ ప్ర‌మోష‌న్స్ జోరందుకున్నాయి.

అయితే ఎలాంటి కంటెంట్ సినిమా చేసిన కూడా తనదైన మార్క్ ప్ర‌మోష‌న్ చేసి అంద‌రి అటెన్ష‌న్ త‌న వైపుకి తిప్పుకోవ‌డం విజ‌య్ దేవ‌రకొండ స్పెషాలిటి. తాజాగా ఖుషి సినిమాకి సంబంధించి ‘ఖుషి లివ్ మ్యూజిక్ కన్సర్ట్’ పేరుతో హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌లో చిత్రం యూనిట్ మొత్తంతో పాటుగా విజయ దేవరకొండ మరియు సమంత కూడా పాల్గొని సంద‌డి చేశారు.

ఇక ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ, స‌మంత చేసిన లైవ్ పెర్ఫార్మన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంద‌ని చెప్పాలి. విజయ్ దేవరకొండ అయితే తాను ధరించిన కోట్ విప్పేసి, సమంత ని ఎత్తుకొని తిప్పడం, ఆ తర్వాత ఇద్దరు రొమాంటిక్ గా కౌగిలించుకోవడం చూసి అంద‌రు షాక్ అయ్యారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఇలా సార్లు మ‌నం చూశాం.

కానీ యువ హీరో విజ‌య్‌తో సమంత ఇలా బోల్డ్ అటెంప్ట్ చేయ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే నాగ చైత‌న్య నుండి విడిపోయాక పుష్ప ఐటెం సాంగ్ చేసి బోలెడ‌న్ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఇక ఇప్పుడు ఈ స్టంట్‌తో ఆ విమ‌ర్శ‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి. విజ‌య్, స‌మంత్ మీరిద్ద‌రు.. హీరో హీరోయిన్స్ లా కాకుండా ఈవెంట్స్ కి డ్యాన్స్ లు వేసే డ్యాన్సర్లులా క‌నిపించార‌ని ఒక‌రు కామెంట్ చేశారు.