విధాత: ప్రస్తుతం నయనతార సరొగసి విధానంలో కవల పిల్లలను పొందిన విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ అయినటువంటి నయనతార సరొగసి విధానంలో పిల్లలను పొందడంతో.. ‘సరొగసి’ అనే పేరుపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. మరి ఇదే సరొగసి విధానంపై ఇప్పుడొక సినిమా వస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే భలే ఉంది కదా.. ఈ ఆలోచననే అక్షరాలా పాటిస్తుంది మరో స్టార్ హీరోయిన్ సమంత. ఆమె ప్రస్తుతం […]
విధాత: ప్రస్తుతం నయనతార సరొగసి విధానంలో కవల పిల్లలను పొందిన విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ అయినటువంటి నయనతార సరొగసి విధానంలో పిల్లలను పొందడంతో.. ‘సరొగసి’ అనే పేరుపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. మరి ఇదే సరొగసి విధానంపై ఇప్పుడొక సినిమా వస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే భలే ఉంది కదా.. ఈ ఆలోచననే అక్షరాలా పాటిస్తుంది మరో స్టార్ హీరోయిన్ సమంత.
ఆమె ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ పాత్రలో చేసిన పాన్ ఇండియా చిత్రం ‘యశోద’. టీజర్‌తోనే ఒక అటెన్షన్‌ని ఏర్పరచుకున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు. ఇందులో సమంత సరొగేట్ మదర్‌గా నటిస్తోంది. అంతే కాదు.. ఆ విధానంలో జరిగే మాఫియాపై ఆమె ఈ చిత్రంలో పోరాడుతున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత సమంతపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాదు, వాట్టే టైమింగ్ అంటూ ఆమెను అభినందిస్తున్నారు కూడా.
ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ ట్రైలర్లో సమంత గర్భవతి అని చూపించారు. ట్రైలర్లో డబ్బు కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళ అని స్పష్టం చేశారు. అంటే ‘యశోద’ది సరొగసి ప్రెగ్నెన్సీ. ఈ సరొగసిలో జరుగుతున్న మోసాలను, కుట్రలను వివరిస్తూ.. సరొగసీ కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళలను ఒక్కచోట చేర్చడం.. ఆ తర్వాత అక్కడ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని కలిగించారు.
సరొగసి కోసం తీసుకొచ్చిన మహిళలకు ఏం జరుగుతోంది? ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న 122 మంది సంపన్న మహిళల పేర్లు బయటకు రావడానికి, సరొగసి ప్రెగ్నెన్సీ ధరించిన మహిళలకు సంబంధం ఏమిటి? ప్లాన్ ప్రకారం ఎవరి హత్య జరిగింది? అని ప్రేక్షకులు ఆలోచించేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు.
‘నీకెప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది’ అని సమంత చెప్పే మాటలో బిడ్డపై తల్లి ప్రేమ వినబడుతుంది. సమంతకు, డాక్టర్ రోల్ చేసిన ఉన్ని ముకుందన్ మధ్య లవ్ ట్రాక్ చూపించారు.
ఇంకా ఈ సినిమాలో క్రైమ్, రాజకీయం.. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మహిళ చేసే పోరాటం ఉంది. సమంత ఇందులో ఫైట్స్ కూడా చేయడం చూపించారు. మొత్తంగా చూస్తే ఇదొక న్యూ ఏజ్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఇక ట్రైలర్ చివరిలో.. ‘యశోద’ ఎవరో తెలుసు కదా? ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి.. అనే డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలెట్. మణిశర్మ మ్యూజిక్, నేపథ్య సంగీతం ఈ సినిమాకి మరో హైలెట్ కాబోతున్నాయనేది కూడా ఈ ట్రైలర్‌తోనే తెలిసిపోతుంది. మొత్తంగా చూస్తే.. సమంత ఇందులో మదర్, ఫైటర్ మరియు పవర్ ఫుల్ వుమెన్‌గా అద్భుతంగా నటించినట్లుగా అయితే అర్థమవుతోంది.
శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గురువారం పాన్ ఇండియ వైడ్‌గా విడుదలైన ఈ ట్రైలర్‌ను.. తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు.