మూవీ పేరు: ‘యశోద’ విడుదల తేదీ: 11 నవంబర్, 2022 నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్నిముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు డైలాగ్స్: పులగం చిన్నారాయణ, భాగ్యలక్ష్మీ కెమెరా: ఎమ్. సుకుమార్ ఆర్ట్: అశోక్ ఫైట్స్: వెంకట్, యానిబెన్ ఎడిటర్: మార్తాండ్. కె వెంకటేష్ సంగీతం: మణిశర్మ నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్ దర్శకులు: హరి-హరీష్ విధాత: స్టార్ హీరోయిన్లలో అన్ని తరహాల సినిమాలు చేస్తున్న హీరోయిన్ సమంత. అనుష్క, నయనతార […]
మూవీ పేరు: ‘యశోద’
విడుదల తేదీ: 11 నవంబర్, 2022
నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్నిముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు
డైలాగ్స్: పులగం చిన్నారాయణ, భాగ్యలక్ష్మీ
కెమెరా: ఎమ్. సుకుమార్
ఆర్ట్: అశోక్
ఫైట్స్: వెంకట్, యానిబెన్
ఎడిటర్: మార్తాండ్. కె వెంకటేష్
సంగీతం: మణిశర్మ
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
దర్శకులు: హరి-హరీష్
విధాత: స్టార్ హీరోయిన్లలో అన్ని తరహాల సినిమాలు చేస్తున్న హీరోయిన్ సమంత. అనుష్క, నయనతార లు కూడా ఓ గీత గీసుకుని ఆ ప్రకారమే సినిమాలు చేస్తుంటే.. సమంత మాత్రం ఆల్రౌండర్లా అన్ని సినిమాలు చేసేస్తోంది. ఫ్యామిలీమాన్ వెబ్ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సమంత.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్‌గా కూడా మారిపోయింది. అలాగే హీరోల సరసన కూడా.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోల సరసన కూడా ఆమె హీరోయిన్గా చేస్తోంది.
ఇలా అన్ని తరహా పాత్రలు చేస్తున్న సమంతను ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఆమె చేస్తున్న సినిమాలపై సింపతీకి కారణం అవుతుండటం విశేషంగానే చెప్పుకోవాలి. విడాకులు, మయోసైటీస్.. ఇవి రెండూ సమంతను వేధిస్తున్నా.. ఆమె చిత్రాల ప్రమోషన్స్‌కి మాత్రం ప్లస్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన ‘యశోద’ చిత్రం పాన్ ఇండియా స్థాయి క్రేజ్‌కి ఇవి కూడా కారణమని చెప్పుకోవచ్చు.
సినిమాకు సంబంధించి ఒక్క పబ్లిక్ ఫంక్షన్ కూడా చేయకుండా.. ఈ సినిమా విడుదలైందీ అంటే.. అందుకు సమంత ప్లస్సు, మైనస్సులే కారణం అని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రేక్షకులలో ఉందీ అంటే.. అందుకు కారణం ఆమె బాధ పడుతున్న మయోసైటీస్ ప్రధాన పాత్ర పోషించిందనే చెప్పుకోవాలి. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్ట్.. ఈ సినిమా ప్రచారానికి ఎంతో యూజైంది. ఆ తర్వాత సుమతో ఆమె చేసిన ఇంటర్వ్యూలో తెలిపిన విషయాలు, చిత్ర ట్రైలర్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.
చిన్న బడ్జెట్‌తో అనుకున్న ఈ చిత్రం.. సమంత ఓకే చేయడంతో పాన్ ఇండియా స్థాయికి మారిపోయిందని నిర్మాత తన ఇంటర్వ్యూలో చెప్పడం, ఇంకా వరలక్ష్మీ శరత్ కుమార్ కాన్ఫిడెన్స్.. ప్రస్తుతం కరెంట్ టాపిక్ అయినటువంటి ‘సరొగసి’.. ఇలా ప్రతీది ఈ సినిమాపై భారీ క్రేజ్‌కి కారణమయ్యాయి. చాలా గ్యాప్ తర్వాత సమంత నుంచి వస్తున్న ఈ చిత్రం.. ఆమె కెరీర్‌కే కాకుండా.. తన చుట్టూ ఉన్న నెగిటివిటీకి కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంది? సమంత స్థాయికి ఇది ఎలా యూజ్ కాబోతోంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సరొగసి.. బాలీవుడ్ సంగతి పక్కన పెడితే.. నయనతార వంటి స్టార్ హీరోయిన్ కూడా ఈ బాట పట్టడంతో.. ఇప్పుడిదో హాట్ టాపిక్ అయింది. సంతానం లేని ధనవంతుల కోరికను తీర్చడానికి కొన్ని హాస్పిటల్స్, అందులోని డాక్టర్స్ సూచించే పద్ధతుల్లో ‘సరొగసి’ కూడా ఒకటి. అయితే ఈ పద్ధతులలో కూడా కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని తెలియజెప్పడమే ఈ సినిమా కథలోని మెయిన్ పాయింట్.
కథలోకి వస్తే.. తన చెల్లికి అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాల్సి రావడంతో.. అందుకు డబ్బు అవసరం ఉండటంతో.. యశోద (సమంత) సరొగసికి అంగీకరిస్తుంది. కరెక్ట్‌గా ఇలాంటి పేదరికంలో ఉన్న అమ్మాయిలని సరొగసికి ఒప్పించి.. అక్రమాలు చేస్తుంటారు మధు (వరలక్ష్మీ శరత్ కుమార్) మరియు గౌతమ్ (ఉన్ని ముకుందన్). అలా యశోదను కూడా ఒప్పిస్తారు.
కానీ ఈ ప్రాసెస్‌లో యశోదకు అడుగడుగునా అనుమానం వస్తుంటుంది.. తర్వాత ఆమె అనుమానం నిజమవుతుంది. ‘సరొగసి’ విధానంతో మధు, గౌతమ్‌లు చేస్తున్న అక్రమాలు ఏమిటి? దానిని యశోద ఎలా కనిపెట్టింది? ఎలా వారి అక్రమాలను యశోద బయటపెట్టింది? అసలు ఎవరీ యశోద? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఈ సినిమా థియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘యశోద’గా సమంత నట విశ్వరూపం చూపించేసింది. అమాయకురాలిగా, సరొగసి బాధితురాలిగా, సెకండాఫ్ పోరాట సన్నివేశాల్లో.. అలాగే ఎమోషనల్ సీన్స్‌లో సమంత చెలరేగి పోయిందని చెప్పుకోవచ్చు. సరికొత్త సమంతని తెరపై చూసినట్లు అనిపిస్తుంది. పైన చెప్పుకున్నట్లుగా ఆమె కెరీర్లోనే ఈ సినిమా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆమె చుట్టూ ఉన్న నెగిటివిటీని దూరం చేసి పాజిటివిటీని చేర్చేలా ఆమె ఈ సినిమాలో నటనను కనబరిచింది.
ఆమె తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ వైవిధ్యభరితమైన పాత్రలో నటించడమే కాకుండా.. తన నటనతో ఆ పాత్ర స్థాయినే పెంచేసింది. ఆమెకు కూడా ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. తెలుగులో ఆమె స్థానాన్ని సుస్థిరం చేసేలా వరాలు తన నటనతో ఇరగ్గొట్టేసింది. ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్, శత్రు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. అద్భుతమైన నటనను కనబరిచారు. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారంతా కూడా.. వారి వారి పాత్రల పరిధిమేర ఈ సినిమాకు హెల్ప్ అయ్యారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మణిశర్మ ఈజ్ బ్యాక్.
ముందుగా మణిశర్మ అని ఎందుకూ అంటే.. అది సినిమా చూసిన వారికే తెలుస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అరిపించేశాడు. ఈ సినిమాని ఓ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే కెమెరా, ఆర్ట్ వర్క్ కూడా అదుర్స్ అనే రేంజ్లో ఉన్నాయి. డైలాగ్స్ కూడా వివరంగా, అర్థవంతంగా ఉన్నాయి. ప్రథమార్థంలో వచ్చే కొన్ని సీన్లు ల్యాగ్ అనిపించినా.. మణిశర్మ తన సంగీతంతో మ్యానేజ్ చేసేశాడు. ఆ సీన్స్ విషయంలో ఎడిటర్ ఇంకాస్త చురుకుగా వ్యవహరించాల్సింది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
ఇక దర్శకులు హరి-హరీష్ రాసుకున్న కథ, స్కీన్‌ప్లే, డైరెక్షన్ అన్ని చక్కగా కుదిరాయి. కాకపోతే.. ఇంకాస్త ఎక్స్పెక్ట్ చేసే సీన్లను.. వారు సింపుల్‌గా ముగించేసే తీరే.. ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసే అవకాశం ఉంది. అయితేనేం.. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సన్నివేశాలు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్‌కి గురిచేస్తాయంటే.. ఏ రేంజ్లో వారు ఈ సినిమాకు ఎఫర్ట్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. సెకండాఫ్‌లో సమంతని వారు చూపించిన విధానానికి.. వారిని అభినందించకుండా ఉండలేరు. సెకండాఫ్ పరంగా ఫైట్ మాస్టర్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సమంతతో వారు చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్ చేస్తాయి.
విశ్లేషణ:
విదేశాలలో ‘సరొగసి’ పెద్ద ప్రాబ్లమ్ కాదేమో కానీ.. భారత్‌లో మాత్రం ఇదొక సోషల్ ఇష్యూగానే అంతా పరిగణిస్తున్నారు. రీసెంట్గా నయనతార దంపతులు.. ఈ విధానంతో కవల పిల్లలకి పేరేంట్స్ అయ్యారు. అప్పటి నుంచి ఈ విధానంపై వార్తలే వార్తలు. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ సినిమా ప్రమోషన్స్‌కి నయనతార కూడా హెల్ప్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇటువంటి టాపిక్‌ని ఎంచుకోవడంతోనే దర్శకులు సక్సెస్ అయ్యారు.
ప్రథమార్థం అంతా.. యశోద పేదరికం, సరొగసికి అంగీకరించడం, అందులోని అవకతవకలను కనిపెట్టే క్రమంలో నడిస్తే.. సెకండాప్ అంతా ఈ అక్రమ విధానంపై సమంత పోరాటం చేసిన తీరుని చూపించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి సస్పెన్స్ జోడించి.. చూసే ఆడియన్స్‌కి దర్శకులు సరికొత్త కిక్ ఇస్తారు. కొన్ని సీన్స్ వావ్ అనిపిస్తున్నాయి. అలాగే కొన్ని సీన్స్ లాజిక్ లెస్‌గా ఉంటాయి. అయినా కూడా థ్రిల్లింగ్‌గా సినిమా సాగుతుండటంతో.. అవేం పెద్ద బోర్‌గా అనిపించవు.
మొత్తంగా అయితే.. సమంత ఈ సినిమాలో పండించిన ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆమె చెలరేగిన తీరు అందరినీ ఆశ్చర్యపరడమే కాకుండా.. అలరిస్తాయి. సమంత అభిమానులకు మాత్రం ఈ సినిమా ఫుల్ మీల్స్ వంటిదే. అలాగే ఒక బర్నింగ్ ఇష్యూని దర్శకులు తెరపై చూపించిన విధానం కూడా అందరినీ అలరిస్తుంది. ఈ విధానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే విధంగా సినిమాని ఆసక్తిగా మలిచారు.
ముందు ముందు వారి నుంచి సామాజిక స్పృహతో నిండిన కథలని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాకపోతే స్క్రీన్‌ప్లే పరంగా.. ఇంకాస్త స్పీడ్ పెంచాలి. ఈ సినిమా ముఖ్యంగా ప్రథమార్థం చాలా స్లోగా నడిచినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా అయితే.. ఆడియన్స్‌ని ఈ యశోద థ్రిల్ చేస్తుంది తప్ప డిజప్పాయింట్ చేయదు.
ట్యాగ్‌లైన్: సమంత నట విశ్వరూపం
రేటింగ్: 3.25/5