మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇంటికి బండి సంజయ్
విధాత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇంటికి వెళ్లారు. సంజయ్‌కి నర్సయ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య మాట్లాడుతూ.. ఈ నెల 19న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్‌ను కలవడం టీఆర్ఎస్ నేతలకు ఉద్యమంలా మారిందని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని, నిజమైన ఉద్యమ కారులకు […]

విధాత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇంటికి వెళ్లారు. సంజయ్‌కి నర్సయ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య మాట్లాడుతూ.. ఈ నెల 19న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్‌ను కలవడం టీఆర్ఎస్ నేతలకు ఉద్యమంలా మారిందని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.

బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని, నిజమైన ఉద్యమ కారులకు బీజేపీ వేదికైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే నర్సయ్య బీజేపీలో చేరుతున్నారు. దుబ్బాక, హుజురాబాద్‌కు కేంద్రం ఇచ్చిన నిధులపై స్పష్టత ఇచ్చాం.

రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు సీఎం కేసీఆర్ ఇవ్వడం లేదన్నారు. నర్సయ్య గౌడ్ చేరికతో మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమైందన్నారు. మునుగోడులో ఒక గ్రామానికి సీఎంను ఇన్‌ఛార్జిగా పెట్టిన ఘనత బీజేపీ ది అన్నారు.