స‌చివాల‌యం ఎదుట బైక్‌పై భ‌యంక‌ర‌మైన స్టంట్స్‌తో యువ‌కుడి హ‌ల్‌చ‌ల్‌.. వీడియో

న‌గ‌రంలోని నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ ర‌హ‌దారుల‌తో పాటు ప‌లు ఫ్లై ఓవ‌ర్ల‌పై కొంత‌మంది యువ‌కులు బైక్ విన్యాసాల‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు

స‌చివాల‌యం ఎదుట బైక్‌పై భ‌యంక‌ర‌మైన స్టంట్స్‌తో యువ‌కుడి హ‌ల్‌చ‌ల్‌.. వీడియో

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ ర‌హ‌దారుల‌తో పాటు ప‌లు ఫ్లై ఓవ‌ర్ల‌పై కొంత‌మంది యువ‌కులు బైక్ విన్యాసాల‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. స‌చివాల‌యం ఎదుట ఓ యువ‌కుడు కూడా హంగామా సృష్టించాడు.


యాక్టివాపై వెళ్తూ భ‌యంక‌ర‌మైన స్టంట్స్ కు పాల్ప‌డ్డాడు. బైక్ ముందు టైర్ గాల్లోకి లేపి, వెనుక టైర్ స‌హాయంతోనే అతి వేగంగా దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.


ఆ వీడియో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వ‌చ్చింది. ఓ యువ‌కుడు ఆ బైక్ నంబ‌ర్ వివ‌రాల‌ను సైతం పోలీసుల‌కు ట్విట్ట‌ర్ ద్వారా పంపించాడు. ఈ త‌రహా స్టంట్లు చేసే యువ‌కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స‌ద‌రు యువ‌కుడు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల‌ను కోరాడు.