బైక్‌పై స్టంట్స్‌.. అమ్మాయిల ముందు అభాసుపాలు.. వీడియో

విధాత: అది ఓ ప్ర‌ధాన ర‌హదారి.. బ‌స్టాప్‌లో కాలేజీ అమ్మాయిలు బ‌స్సు కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మాయిల ముందు ఫోజులు కొట్టేందుకు.. ఓ ముగ్గురు యువ‌కులు బైక్‌పై భ‌యంక‌ర‌మైన స్టంట్స్ చేశారు. కానీ వారి విన్యాసాలు వ‌ర్క్ అవుట్ కాలేదు. ఒక‌డు బైక్‌పై నుంచి కింద ప‌డిపోయాడు. అమ్మాయిల ముందు అభాసుపాల‌య్యాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని కారైకుడిలో చోటు చేసుకుంది. భ‌యంక‌ర‌మైన బైక్ స్టంట్స్‌కు పాల్ప‌డిన మ‌హేశ్వ‌ర‌న్‌, గోపాల‌కృష్ణ‌న్, హ‌రిప్ర‌సాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి విన్యాసాల‌కు […]

బైక్‌పై స్టంట్స్‌.. అమ్మాయిల ముందు అభాసుపాలు.. వీడియో

విధాత: అది ఓ ప్ర‌ధాన ర‌హదారి.. బ‌స్టాప్‌లో కాలేజీ అమ్మాయిలు బ‌స్సు కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మాయిల ముందు ఫోజులు కొట్టేందుకు.. ఓ ముగ్గురు యువ‌కులు బైక్‌పై భ‌యంక‌ర‌మైన స్టంట్స్ చేశారు. కానీ వారి విన్యాసాలు వ‌ర్క్ అవుట్ కాలేదు. ఒక‌డు బైక్‌పై నుంచి కింద ప‌డిపోయాడు. అమ్మాయిల ముందు అభాసుపాల‌య్యాడు.

ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని కారైకుడిలో చోటు చేసుకుంది. భ‌యంక‌ర‌మైన బైక్ స్టంట్స్‌కు పాల్ప‌డిన మ‌హేశ్వ‌ర‌న్‌, గోపాల‌కృష్ణ‌న్, హ‌రిప్ర‌సాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి విన్యాసాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం ఈ బైక్ స్టంట్ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.