బీజేపీలోకి బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

బీఆరెస్ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీఆరెస్‌కు రాజీనామా చేసి ఆదివారం న్యూఢిల్లీలో బీజేపీలో చేరారు

బీజేపీలోకి బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

ఇద్దరు మాజీ ఎంపీలు..మరో మాజీ ఎమ్మెల్యే సైతం బీజేపీలోకి

విధాత, హైదరాబాద్‌ : బీఆరెస్ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీఆరెస్‌కు రాజీనామా చేసి ఆదివారం న్యూఢిల్లీలో బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిల సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు తరుణ్‌చుగ్ పార్టీ సభ్యత్వం అందించి, పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్లగొండ లోక్‌సభ స్థానం బీజేపీ టికెట్‌ను సైదిరెడ్డి ఆశిస్తున్నారు. అలాగే బీఆరెస్‌కు చెందిన మహబూబాబాద్, అదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాంనాయక్‌, గోడం నగేశ్‌, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావులు కూడా బీజేపీలో చేరడం గమనార్హం.