హైదరాబాద్‌లో షారుఖ్ ‘పఠాన్’ మేనియా

విధాత‌: బాలీవుడ్‌లో బాద్‌షాగా పిలుచుకునే అమితాబచ్చన్ తర్వాత ఆ బిరుదు అనేది షారుక్ ఖాన్ కి పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈయనను నేడు బాలీవుడ్ బాద్‌షాగానే అందరూ పిలుస్తున్నారు. అలాగే ఆయన దేశ‌వ్యాప్తంగా కింగ్ ఖాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. బాజీఘర్, డ‌ర్ వంటి చిత్రాల‌తో ఆయ‌న‌కు ఎక్క‌డ‌లేని గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత యాక్ష‌న్ హీరోగానే కాకుండా రొమాంటిక్ స్టార్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. బుల్లితెర నుంచి ప్రారంభ‌మైన ఆయ‌న న‌ట‌నా ప్ర‌స్థానం నేటి వ‌ర‌కు అప్ర‌తిహ‌తంగా సాగుతోంది. […]

  • By: krs    latest    Jan 22, 2023 7:26 AM IST
హైదరాబాద్‌లో షారుఖ్ ‘పఠాన్’ మేనియా

విధాత‌: బాలీవుడ్‌లో బాద్‌షాగా పిలుచుకునే అమితాబచ్చన్ తర్వాత ఆ బిరుదు అనేది షారుక్ ఖాన్ కి పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈయనను నేడు బాలీవుడ్ బాద్‌షాగానే అందరూ పిలుస్తున్నారు. అలాగే ఆయన దేశ‌వ్యాప్తంగా కింగ్ ఖాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. బాజీఘర్, డ‌ర్ వంటి చిత్రాల‌తో ఆయ‌న‌కు ఎక్క‌డ‌లేని గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత యాక్ష‌న్ హీరోగానే కాకుండా రొమాంటిక్ స్టార్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు.

బుల్లితెర నుంచి ప్రారంభ‌మైన ఆయ‌న న‌ట‌నా ప్ర‌స్థానం నేటి వ‌ర‌కు అప్ర‌తిహ‌తంగా సాగుతోంది. ఆయన చిత్రాలు విడుదలవుతున్నాయి అంటే చాలు సినిమా ఎలా ఉంటుంది అనే విషయం పక్కనపెడితే రికార్డ్ ఓపెనింగ్స్ వస్తాయి. ఇక షారుఖ్‌కు ఓవర్సీస్‌లో ఉన్న మార్కెట్ భారతదేశంలోని మరే హీరోకు లేదంటే అతిశయోక్తి కాదేమో.

బాలీవుడ్ చిత్రాలకు ఓవర్సీస్‌లో మార్కెట్‌ను విపరీతంగా పెంచిన ఘనత ఈ ఖాన్‌కే దక్కుతుంది. ఈయన అమితాబ్ తర్వాత సూపర్ స్టార్ బిరుదుకు సరితూగుతారు కూడా. ఇక షారుఖ్ చివరిగా నటించిన చిత్రం ‘జీరో’ 2018లో విడుదలైంది. అప్పటినుండి ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ హీరోగా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసినప్పటికీ సోలో హీరోగా ఆయనకు మరో చిత్రం లేదు.

ఇన్నేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ‘పఠాన్’ చిత్రంతో వచ్చేందుకు సిద్ధమయ్యారు. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఈనెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ముసలోడికి దసరా పండగ అంటే ఇదే!

అయితే కేవలం హైదరాబాద్‌లోనే ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే రెండు వందలకు పైగా షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ మధ్యకాలంలో విడుదలైన బాలీవుడ్ సినిమాలకు దేనికి ఈ రేంజ్‌లో బుకింగ్స్ రాలేదు.

ఒక్క హైదరాబాద్ నుంచి ఈ సినిమాకి రెండు కోట్ల రూపాయల గ్రాస్ కేవలం బుకింగ్స్ ద్వారా వచ్చాయని తెలుస్తుంది. దీన్ని బట్టి షారుఖ్ మేనియా ఎలా ఉందో అర్ధ‌మ‌వుతుంది. హైదరాబాద్‌లో వారం రోజుల ముందు ఈ స్థాయి గ్రాస్ మన తెలుగు సినిమాలకు కూడా లేదని చెప్పాలి.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటి రోజు వసూళ్లను కూడా ‘పఠాన్’ దాటేస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. బాలీవుడ్‌కి చాలా కాలంగా దూరమైన హిట్‌ని మళ్లీ ఈ సీనియర్ తిరిగి తీసుకొస్తాడని హిందీ పరిశ్రమ మొత్తం వేచి చూస్తోంది.