Bigg Boss7 | శివాజీ దెబ్బకు మహాబలి టీం కుదేలు.. మాయాస్త్ర దక్కించుకున్న వారి మధ్య చిచ్చుకి బిగ్ బాస్ స్కెచ్
Bigg Boss7 | బిగ్ బాస్ సీజన్ 7లో ప్రస్తుతం 13 మంది సభ్యులు ఉండగా, ఇందులో పవర్ ఆస్త్ర దక్కించుకున్న సందీప్‌ని సంచాలకుడిగా ఉంచి మిగతా కంటెస్టెంట్స్ ని రెండు గ్రూపులుగా విభజించారు బిగ్ బాస్. రణధీర, మహాబలి టీంలు మాయాస్త్ర కోసం పలు టాస్క్‌లు ఆడుతున్నారు. మొదటి దశలో రణధీర టీం సభ్యులు ( శివాజీ, అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, షకీలా) విజయం సాధించి.. మాయాస్త్ర కీ దక్కించుకున్న విషయం తెలిసిందే. […]

Bigg Boss7 |
బిగ్ బాస్ సీజన్ 7లో ప్రస్తుతం 13 మంది సభ్యులు ఉండగా, ఇందులో పవర్ ఆస్త్ర దక్కించుకున్న సందీప్‌ని సంచాలకుడిగా ఉంచి మిగతా కంటెస్టెంట్స్ ని రెండు గ్రూపులుగా విభజించారు బిగ్ బాస్. రణధీర, మహాబలి టీంలు మాయాస్త్ర కోసం పలు టాస్క్‌లు ఆడుతున్నారు. మొదటి దశలో రణధీర టీం సభ్యులు ( శివాజీ, అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, షకీలా) విజయం సాధించి.. మాయాస్త్ర కీ దక్కించుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆ కీని కొట్టేయాలని మహాబలి టీం సభ్యులు (శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, దామిని) ప్రయత్నాలు చేయగా, వారికి శివాజి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. వాళ్లు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని గ్రహించిన శివాజీ.. ‘మీరు మీ ఓవరాక్షన్.. మూసుకుని పడుకోండి.. మీరు ఆడేది శివాజీతో.. ఈ తాళం తీయడం మీ వల్ల కాదు.. ఏం యాక్టింగ్ చేస్తున్నారు.. ఎవడు చెప్పాడు మీకు తాళం కొట్టేయొచ్చుని ఆ డాక్టర్ గాడు చెప్పాడా? మీరు మీ పెర్ఫామెన్స్.. ఆ తాళం చేరాల్సిన చోటికి వెళ్లిపోయింది సుబ్బూ’ అంటూ గట్టిగానే ఇచ్చి పడేశాడు.
ఇక మాయాస్త్ర దక్కించుకునేందుకు బిగ్ బాస్.. ‘మలుపులో ఉంది గెలుపు’ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో స్పిన్ విల్ ముల్లు ఆగే రంగుని ఇరు టీమ్‌ల సభ్యులు ఫాలో కావాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. బోర్డ్ నుంచి బయటకు రాకుండా రంగు సర్కిల్‌లో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పగా, ఈ టాస్క్ లో కూడా రణధీర టీమ్ విజేతగా నిలిచి రెండో కీ ని దక్కించుకున్నారు.
ఈ క్రమంలో రణ ధీర టీమ్ కి మాయాస్త్ర దక్కింది. ఇందులో ఆరు చక్రాలు ఉండగా, ఆరుగురు టీమ్ సభ్యులు తీసుకొని తెగ సంతోషిస్తున్నారు. ఆ సమయంలో బిగ్ బాస్.. పవర్ అస్త్ర కోసం ఈ ఆరుగురే పోటీ పడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి శివాజి మాత్రం టాస్క్‌లో తెగ హైలైట్‌గా నిలిచాడు. ఇక మహాబలి టీం సభ్యుల్ని అయితే ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు అనే చెప్పాలి. ఇక ‘మాయాస్త్ర’ టాస్క్‌కి సంచాలకుడిగా ఉన్న సందీప్.. పవరాస్త్రని నొక్కేసింది వకీల్ పాప శుభ శ్రీ రాయగురు తాజా ఎపిసోడ్‌లో మరో హైలైట్ అని చెప్పాలి. ఇక హౌజ్‌లో ఇంగ్లీష్‌లో, హిందీలో మాట్లాడుతున్న యావర్‌కి బిగ్ బాస్ శిక్ష వేశాడు.
యావర్‌ని డిస్టర్బ్ చేసేందుకు మహాబలి టీమ్ ఎంతో ప్రయత్నిస్తున్న నేపథ్యంలో శివాజీ వాయిలెంట్ గా మారాడు. డంబెల్స్ విసిరేసి కాసేపు హంగామా సృష్టించాడు. ఈ పరిణామాలని బట్టి నేటి ఎపిసోడ్ మరింత రంజుగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక రెండో వారంలో ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్‌లో గౌతం కృష్ణ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, రతిక, ప్రిన్స్ యావర్,షకీలా, శోభా శెట్టి, శివాజీ, తేజ ఉన్న విషయం తెలిసిందే.