కరెన్సీపై దేవతలు కాదు.. శివాజీ బొమ్మ పర్ఫెక్ట్‌!: BJP ఎమ్మెల్యే

విధాత: దేశంలో కరెన్సీ నోట్లపై ఏ బొమ్మ ఉండాలన్న చర్చ జోరుగా నడుస్తున్నది. నోట్లపై హిందూ దేవతలైన లక్ష్మీదేవి, గణపతి చిత్రాలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందన్నారు. అయితే లక్ష్మీదేవి, గణపతి, మహాత్మా గాంధీ చిత్రాలు కాదు మా ప్రాంత వీరుడి ఫొటో అయితే కరెన్సీ నోటుపై సరిగ్గా సెట్‌ అవుతుందని మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే అంటున్నారు. ఏకంగా […]

కరెన్సీపై దేవతలు కాదు.. శివాజీ బొమ్మ పర్ఫెక్ట్‌!: BJP ఎమ్మెల్యే

విధాత: దేశంలో కరెన్సీ నోట్లపై ఏ బొమ్మ ఉండాలన్న చర్చ జోరుగా నడుస్తున్నది. నోట్లపై హిందూ దేవతలైన లక్ష్మీదేవి, గణపతి చిత్రాలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందన్నారు.

అయితే లక్ష్మీదేవి, గణపతి, మహాత్మా గాంధీ చిత్రాలు కాదు మా ప్రాంత వీరుడి ఫొటో అయితే కరెన్సీ నోటుపై సరిగ్గా సెట్‌ అవుతుందని మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే అంటున్నారు. ఏకంగా నోటుపై మహాత్మాగాంధీ స్థానంలో ఆ వీరుడి ఫొటోతో మార్ఫింగ్‌ చేసిన నోటును సోషల్‌ మీడియా షేర్‌ చేశారు.