మా ఇంటికి నేనే ద‌రిద్రం.. ఆ హీరోయిన్ అలా అనేసింది ఏంటి?

  • By: sn    latest    Nov 27, 2023 7:49 AM IST
మా ఇంటికి నేనే ద‌రిద్రం.. ఆ హీరోయిన్ అలా అనేసింది ఏంటి?

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రించిన హీరో రాజ‌శేఖ‌ర్. యాంగ్రీమెన్‌గా పిలిపించుకున్న రాజ‌శేఖ‌ర్ సెకండ్ ఇన్నింగ్స్‌లోను స‌త్తా చాటుతున్నాడు. అయితే రాజ‌శేఖ‌ర్‌తో పాటు ఇప్పుడు ఆయ‌న కూతుళ్లు కూడా సినీ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. స్టార్ హీరోయిన్స్‌గా మారేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. శివాత్మిక‌, శివానీలు అవ‌సరం ఉన్న‌ప్పుడు హీరోయిన్‌గా న‌టిస్తూనే కొన్ని సినిమాల‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే శివాని రీసెంట్‌గా కోట బొమ్మాళి పీఎస్ అనే చిత్రంతో ప్రేక్షకుల‌ని ప‌ల‌క‌రించింది. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ థ్రిల్ల‌ర్ మూవీ నవంబర్ 24న విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.


తేజ మార్ని ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీవాసు నిర్మించారు. ఈ సినిమా హిట్‌తో శివాని రాజశేఖర్ సంతోషంగా ఉంది. మూవీ రిలీజ్ తర్వాత కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తుంది. తాజాగా తన ఫ్యామిలీ గురించి కోవిడ్ సమయంలో జరిగిన సంఘటన గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది శివాని. త‌న తండ్రి రాజశేఖర్ తో కలసి శేఖర్ మూవీలో నటించిన సమయంలో నాకు హెల్త్ ఇష్యూ ఇందేది. గుండె దడ వచ్చేది. కోవిడ్ టైంలో నాకు కరోనా రాగా, ఆ తర్వాత నాన్నకి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే నాన్నకి సీరియస్ అయి వెంటిలేట‌ర్ వ‌ర‌కు వెళ్లారు. అయితే నెలకి ఒకసారి వచ్చే గుండె దడ నాకు అప్పుడు రోజుకు రెండు మూడు సార్లు వచ్చేది.


నాన్న‌ని చూసి చాలా భ‌య‌ప‌డ్డాను.నా జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయం అదే.నాన్న శాచురేషన్ బాగా పడిపోయింది. 60 వరకు వచ్చింది. ఆ సమయంలో నా జాతకం గురించి ఆలోచించా. నా వల్లే నాన్నకి కరోనా వచ్చింది. ఇంటికి నేనే బ్యాడ్ ఏమో.. జాతకంలో దోషం ఉందేమో అని ఎంతో బాధ‌ప‌డ్డాను. అయితే అంద‌రి ప్రార్ధ‌న‌ల వ‌ల‌న నాన్న క్షేమంగా భ‌య‌ట‌ప‌డ్డార‌ని శివాని చెప్పుకొచ్చింది. నాన్న అంత సీరియ‌స్‌గా ఉన్న స‌మ‌యంలో నా గురించి చాలా ఆలోచించారు. నువ్వు ఎక్కువ ఏడ‌వ‌కు, ఏడిస్తే హార్ట్ ఇష్యూ వ‌స్తుంద‌ని బెడ్‌పై నుండి ఓదార్చేవారు అంటూ శివాని అప్ప‌టి ప‌రిస్థితుల‌ని తెలియ‌జేసి అంద‌రు ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసింది.