అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు.. సుప్రీంకోర్టులో కోదాడ ఎమ్మెల్యే ‘బొల్లం’కు చుక్కెదురు

విధాత: ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పణ వివాదంలో హైకోర్టులో సాగుతున్న కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు కోరుతూ కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన తన అఫిడవిట్‌లో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆస్తుల వివరాలను తప్పుడుగా చూపారంటూ ఆయన ఎన్నికను ప్రశ్నిస్తూ మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో తన వివరణకు […]

అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు.. సుప్రీంకోర్టులో కోదాడ ఎమ్మెల్యే ‘బొల్లం’కు చుక్కెదురు

విధాత: ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పణ వివాదంలో హైకోర్టులో సాగుతున్న కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు కోరుతూ కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన తన అఫిడవిట్‌లో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆస్తుల వివరాలను తప్పుడుగా చూపారంటూ ఆయన ఎన్నికను ప్రశ్నిస్తూ మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ హైకోర్టులో కేసు వేశారు.

ఈ కేసులో తన వివరణకు హైకోర్టు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మల్లయ్య యాదవ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ధర్మాసనం తిరస్కరించింది.

హైకోర్టులో ఇంతకాలంగా ఎందుకు మీరు సమాధానం చెప్పలేదని పిటిషనర్ మలయ్య యాదవ్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మీ న్యాయవాదితో మాట్లాడి హైకోర్టుకు సమాచారం చేరవేయాల్సిన బాధ్యత మీదేనని ఆయన పిటిషన్ తిరస్కరించింది.