Siddipet: సిద్దిపేట కలెక్టరేట్‌లో వీధికుక్క వీరంగం.. కుక్క కాటుకు గురైన అదనపు కలెక్టర్..!
విధాత: రాష్ట్రంలో ఇటీవల వీధి కుక్కల దాడుల బాధితులు పెరిగిపోతున్న తీరు జనాలను భయాందోళన గురిచేస్తుంది. చివరికి రోడ్లపై వెళ్తున్న పిల్లలపై, సామాన్య జనంపైనే కాదు.. ఏకంగా కలెక్టరేట్లలోనూ వీధి కుక్కలు వీరంగం చేసి అదనపు కలెక్టర్‌ను గాయపరిచిన ఘటన తాజాగా సంచలనం రేపింది. అయితే వారం రోజుల క్రితం జరిగిన ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాపం వీధి కుక్కలకు తెలవదు.. ఆయన అదనపు కలెక్టర్ అన్న సంగతి.. తమ సహజ ప్రతాపాన్ని ఆయనపై […]

విధాత: రాష్ట్రంలో ఇటీవల వీధి కుక్కల దాడుల బాధితులు పెరిగిపోతున్న తీరు జనాలను భయాందోళన గురిచేస్తుంది. చివరికి రోడ్లపై వెళ్తున్న పిల్లలపై, సామాన్య జనంపైనే కాదు.. ఏకంగా కలెక్టరేట్లలోనూ వీధి కుక్కలు వీరంగం చేసి అదనపు కలెక్టర్‌ను గాయపరిచిన ఘటన తాజాగా సంచలనం రేపింది. అయితే వారం రోజుల క్రితం జరిగిన ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాపం వీధి కుక్కలకు తెలవదు.. ఆయన అదనపు కలెక్టర్ అన్న సంగతి.. తమ సహజ ప్రతాపాన్ని ఆయనపై కూడా ప్రదర్శించి కరిచి కాళ్ల పిక్కలు పీకేశాయి. వివరాల్లోకి వెళితే సిద్దిపేట కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం రాత్రి సిద్దిపేట అదనపు కలెక్టర్( రెవిన్యూ) శ్రీనివాస్ రెడ్డి తన నివాస క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తుండగా ఓ వీధి కుక్క ఆయనపై దాడి చేసి కరిచింది.
ఈ ఘటనలో శ్రీనివాస్ రెడ్డి రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను సిబ్బంది సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరో వీధికుక్క అదే రోజు రాత్రి అదే జిల్లా కలెక్టర్ పెంపుడు కుక్కను కూడా కరిచింది.
అలాగే ఇంకో వ్యక్తితో పాటు కలెక్టరేట్ సమీపంలోని పౌల్ట్రీ ఫామ్ వద్ద ఆడుకుంటున్న బాలుడిని కూడా వీధి కుక్కలు కరిచాయి. ఈ ఘటనతో కలెక్టరేట్ ప్రాంగణం పరిసరాల్లో ప్రజలు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.