సింగరేణి ప్రైవేటీకరణ: నమ్మొద్దన్న ప్రధాని.. నేడు వేలం!

విధాత: ప్రధాని నరేంద్రమోడీ రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రారంభోత్సవానికి వచ్చి సింగరేణిని ప్రవేటీకరించే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. ఈ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం ఉన్నది, కేంద్రం వాటా 49 శాతం మాత్రమే కేంద్రం వాటా ఉన్నదని కాబట్టి ప్రవేటీకరిస్తామని ఎవరు చెప్పినా నమ్మవద్దని అన్నారు. ప్రధాని ఈ మాటలు చెప్పి నెల రోజులు కాలేదు. కానీ తాజాగా దేశ వ్యాప్తంగా 133 బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి […]

  • By: krs    latest    Dec 05, 2022 7:24 AM IST
సింగరేణి ప్రైవేటీకరణ: నమ్మొద్దన్న ప్రధాని.. నేడు వేలం!

విధాత: ప్రధాని నరేంద్రమోడీ రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రారంభోత్సవానికి వచ్చి సింగరేణిని ప్రవేటీకరించే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. ఈ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం ఉన్నది, కేంద్రం వాటా 49 శాతం మాత్రమే కేంద్రం వాటా ఉన్నదని కాబట్టి ప్రవేటీకరిస్తామని ఎవరు చెప్పినా నమ్మవద్దని అన్నారు. ప్రధాని ఈ మాటలు చెప్పి నెల రోజులు కాలేదు.

కానీ తాజాగా దేశ వ్యాప్తంగా 133 బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 3 కొత్త గనులు ఉన్నాయి. ఈ మూడు గనులను వేలం పెట్టకుండా తమకే అప్పగించాలని సింగరేణి సంస్థ కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేలం వేయవద్దని ఇప్పటికే కేంద్ర బొగ్గు గునుల మంత్రికి అనేక సార్లు విన్నవించింది. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు.

బొగ్గు గనుల వేలం విధానం అమల్లోకి వచ్చాక ఇది ఆరో నోటిఫికేషన్‌. తెలంగాణలోని మూడు కొత్త గనులను పాతపద్ధతిలో అప్పగించడానికి కేంద్రం ససేమిరా అంటున్నది. ఈ మూడు గనులతో పాటు సింగరేణి వదిలేసిన మరో గని ఉన్నది. కేంద్రం వేలం జాబితాలో రాష్ట్రంలోని పెనగడప, శ్రావనపల్లి, సత్తుపల్లి బ్లాక్‌-3, కల్యాణిగణి బ్లాక్‌-6 ఉన్నాయి. పెనగడప గనిలో నాణ్యత లేదని జీ13 గ్రేడ్‌ బొగ్గు వస్తున్నదని సింగరేణి సంస్థనే దీన్ని వేలానికి అప్పగించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర తీసుకున్న తాజా నిర్ణయంపై అధికార పార్టీ తీవ్రంగా మండిపడుతున్నది. సింగరేణిని ప్రైవేటీకరించ బోమంటూ.. రామగుండం పర్యటనలో ప్రధాని చేసిన ప్రకటనకు భిన్నంగా తెలంగాణలోని గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా టెండర్‌ ప్రక్రియ చేపట్టంపై మోడీ దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నది.

ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కోయగూడెం కోల్‌ బ్లాక్‌ను ప్రవేట్‌ సంస్థకు అప్పగించిందని గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులో సింగరేణికి గనులు దక్కకుండా చేయడమే మోడీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్న దని ఆగ్రహం వ్యక్తం చేసింది. బొగ్గు గనులు సింగరేణిలో లేకుంటే సంస్థ ఏం చేయాలని, ప్రస్తుతం ఆ సంస్థలో దాదాపు 60 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని ఆ కుటుంబాలను రోడ్డున పడేస్తారా? అని ప్రశ్నిస్తున్నది.

మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ యాక్ట్ 1957 ప్రకారం సింగరేణి సంస్థకు ఓపెన్‌ టెండర్‌తో సంబంధం లేకుండా కోల్‌ బ్లాక్‌లను రిజర్వ్‌ చేసే అధికారం కేంద్రానికి ఉందని, ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై వెంటనే నిర్ణయం తీసకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.