MP Uttam | ఓటమి భయంతోనే నాపై దుష్ప్రచారం: ఉత్తమ్

MP Uttam | విధాత: రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పిసిసి మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అయన హుజూర్ నగర్లో విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తానని 50వేల మెజారిటీతో గెలవ బోతున్నానన్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, ఓటమి భయంతో బిఆర్ఎస్ ప్రత్యర్థులు నాపై రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ దుష్ప్రచారం చేపట్టారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం సైతం […]

  • By: krs    latest    Jun 05, 2023 12:43 AM IST
MP Uttam | ఓటమి భయంతోనే నాపై దుష్ప్రచారం: ఉత్తమ్

MP Uttam |

విధాత: రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పిసిసి మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అయన హుజూర్ నగర్లో విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తానని 50వేల మెజారిటీతో గెలవ బోతున్నానన్నారు.

రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, ఓటమి భయంతో బిఆర్ఎస్ ప్రత్యర్థులు నాపై రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ దుష్ప్రచారం చేపట్టారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం సైతం ప్రజల సొమ్ముతోనే ప్రజలను మోసగించేందుకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలతో గోబెల్స్ ప్రచారం చేస్తుందన్నారు.

రైతు రుణమాఫీ చేయకుండా రైతు దినోత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహించడం విడ్డూరం అన్నారు. ల్యాండ్, సాండ్, వైన్స్, మైన్స్ లతో అవినీతి చేసి అతి తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించినందుకు, దళిత గిరిజన భూములు లాక్కున్నందుకు బిఆర్ఎస్ నాయకులు ఉత్సవాలు జరుపుకావాలని ఉత్తమ్ ఏద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం గతంలో దేశంలోనే ఉత్తమంగా పనిచేసిన తెలంగాణ పోలీస్ శాఖను నిర్వీర్యం చేసి దుర్వినియోగము, అవినీతి మాయం చేసిందన్నారు. హుజూర్ న, కోదాడ నియోజకవర్గలలో దళిత బంధు అమలులో జరిగిన అవినీతిపై బాధిత లబ్ధిదారులతో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి వారు ఏ విధంగా పథకం అవినీతి కారణంగా నష్టపోయామన్న విషయాన్ని వారితోనే వివరించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ దళిత బంధు అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.