Viral Snkae: నెల్లూరులో వింత.. శివలింగాన్ని హత్తుకుని నాగుపాము ప్రార్థన!

Viral, Snake Praying: మహాశివుడి కంఠాభరణంగా భాసిల్లే నాగాహారం నాగుపాము తరుచు పలుచోట్ల శివలింగాలను చుట్టుకున్న ఘటనలు అద్భుతంగా చూస్తుంటాం. అలాంటి అద్భుత ఘటన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ నాగుపాము శివలింగాన్ని హత్తుకుని ఏదో ప్రార్థన చేసినట్లుగా వ్యవహారించింది. నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి శ్రీవిశ్వనాథ స్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని శివ లింగం పక్కనే ఉన్న పుట్టలో నుంచి నాగుపాము బయటకు వచ్చి లింగంపైకి చేరింది. పడగ విప్పి కాసేపు శివలింగంపై అక్కడే ఉండి, తిరిగి పుట్టలోకి వెళ్లిపోయింది.
ఈ అద్భుత ఘటనను చూసిన భక్తులు హరహర మహదేవ..శంభోశంకర అంటూ తన్మయులయ్యారు. శివలింగంపై పడగ విప్పిన నాగేంద్రుడి దర్శనం చూసిన భక్తులంతా ఓం నమః శివాయ అంటూ పులకించారు. రెండు నెలల క్రితం మహాశివరాత్రికి ముందు కూడా నాగుపాము ఆ పుట్టలొంచి బయటకు వచ్చి శివలింగానికి పడగవిప్పి చుట్టుకుని కనిపించింది. ఉదయం అలికిడి విని అర్చకులు శ్రీనివాసులు లేచి చూసే సరికి నాగేంద్రుడు శివలింగంపై దర్శనం ఇవ్వడంతో ఆయన ఆశ్చర్యపోయారు.