Special Trains | సాయిబాబా భక్తులకు గుడ్‌న్యూస్‌.. షిర్డీకి ప్రత్యేక ట్రైన్స్‌ను నడుపనున్న దక్షిణ మధ్య రైల్వే..!

Special Trains | షిర్డీ వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్‌ - నాగర్‌సోల్‌, నాగర్‌సోల్‌ - సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. రైలు నంబర్‌ 07517 ఈ నెల 21, 28 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానానికి చేరనున్నది. నాగర్‌సోల్‌ - సికింద్రాబాద్‌ మధ్య రైలు నంబర్‌ 07518 ఈ నెల 22, 29 తేదీల్లో రాత్రి 22 […]

Special Trains | సాయిబాబా భక్తులకు గుడ్‌న్యూస్‌.. షిర్డీకి ప్రత్యేక ట్రైన్స్‌ను నడుపనున్న దక్షిణ మధ్య రైల్వే..!

Special Trains | షిర్డీ వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్‌ – నాగర్‌సోల్‌, నాగర్‌సోల్‌ – సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది.

రైలు నంబర్‌ 07517 ఈ నెల 21, 28 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానానికి చేరనున్నది.

నాగర్‌సోల్‌ – సికింద్రాబాద్‌ మధ్య రైలు నంబర్‌ 07518 ఈ నెల 22, 29 తేదీల్లో రాత్రి 22 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు గమ్యస్థానానికి చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఆయా ట్రైన్లు రెండు మార్గాల్లో లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్‌, జహీరాబాద్, బీదర్, ఉద్గిర్, గంగఖేర్, పర్భణి, జాల్నా, ఔరంగాబాద్, రోటేగావ్‌ తదితర స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వేశాఖ వివరించింది. ఆయా రైళ్లలో థర్డ్‌ ఏసీ, ఏసీ 2టైర్‌, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లుంటాయని పేర్కొంది.