Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. భారీగా స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..! మార్గాల వారీగా వివరాలు ఇవే..!
Special Trains | దక్షిణ మధ్య ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. అదనపు రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న ఆయా రైళ్లను అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా వీక్లీ స్పెషల్ రైళ్లను వినియోగించుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. రైలు నంబర్. సుబేదార్‌గంజ్ - సికింద్రాబాద్ (Train No. 04121) జులై 06 నుంచి ఆగస్ట్ 31 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. సికింద్రాబాద్ - […]

Special Trains | దక్షిణ మధ్య ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. అదనపు రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న ఆయా రైళ్లను అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా వీక్లీ స్పెషల్ రైళ్లను వినియోగించుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.
రైలు నంబర్. సుబేదార్‌గంజ్ – సికింద్రాబాద్ (Train No. 04121) జులై 06 నుంచి ఆగస్ట్ 31 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. సికింద్రాబాద్ – సుబేదార్‌గంజ్ (04122) జులై 7 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుందని వివరించింది.
కాకినాడటౌన్ – లింగంపల్లి (07445) జులై 3 నుంచి ఆగస్ట్ 30 వరకు పొడిగించినట్లు చెప్పింది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రైలు నడుస్తుందని చెప్పింది. లింగంపల్లి – కాకినాడ (07446) రైలును జులై 4 నుంచి ఆగస్ట్ వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది.
కాచిగూడ – మధురై (07191) ప్రతి సోమవారం జులై 3 నుంచి ఆగస్ట్ 28 వరకు నడుస్తుందని పేర్కొంది. మధురై – కాచిగూడ (07912) జులై 5 నుంచి ఆగస్ట్ 30 వరకు ప్రతి బుధవారం రైలు నడుస్తుందని పేర్కొంది.