Special Trains to Puri | పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌..! స్పెషల్‌ ట్రైన్స్‌ను నడుపనున్న దక్షిణ మధ్య రైల్వే..

Special Trains to Puri | ఈ నెల 20 నుంచి ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభంకానున్నది. యాత్రకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి నాలుగు రోజుల పాటు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నటు తెలిపింది. ఈ నెల 19, 20, 21, 22 తేదీల్లో నడుపనున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్‌-మలాటిపట్పూర్‌, నాందేడ్‌- కుర్దారోడ్‌, కాచిగూడ - మలాటిపట్పూర్‌ స్టేషన్ల మధ్యలో ప్రత్యేక […]

Special Trains to Puri | పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌..! స్పెషల్‌ ట్రైన్స్‌ను నడుపనున్న దక్షిణ మధ్య రైల్వే..

Special Trains to Puri |

ఈ నెల 20 నుంచి ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభంకానున్నది. యాత్రకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి నాలుగు రోజుల పాటు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నటు తెలిపింది.

ఈ నెల 19, 20, 21, 22 తేదీల్లో నడుపనున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్‌-మలాటిపట్పూర్‌, నాందేడ్‌- కుర్దారోడ్‌, కాచిగూడ – మలాటిపట్పూర్‌ స్టేషన్ల మధ్యలో ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి.

సోమవారం (జూన్‌19న) మలాటిపట్పూర్ నుంచి సికింద్రాబాద్‌కు, 19న నాందేడ్ నుంచి ఖుర్దా రోడ్, 20న ఖుర్దా రోడ్ నుంచి నాందేడ్‌కు రైళ్లు నడువనున్నాయి. 21న కాచిగూడ నుంచి మలాటిపట్పూర్, 21న మలాటిపట్పూర్ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

సికింద్రాబాద్‌-మలాటిపట్పూర్‌ మధ్య వెళ్లే ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్ కోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బీరంపూర్, కుర్దారోడ్ స్టేషన్లలో ఆగనున్నాయి.

కాచిగూడ – మలాటిపట్పూర్‌ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్ కోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బీరంపూర్, కుర్దా రోడ్ స్టేషన్లలో ఆగనున్నాయి.

స్పెషల్‌ ట్రైన్స్‌లో ఏసీ 2 కమ్ ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.