Janhvi Kapoor | అయ్యబాబోయ్.. సౌత్‌ మీద ఇంత ప్రేమా? నమ్మెదెలా జాన్వీ?

Janhvi Kapoor విధాత‌: అందాల రాశి, దేవకన్య, అతిలోక సుందరి అయిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. తల్లి శ్రీదేవంత అందంగా లేకపోయినా జాన్వీ కపూర్ కూడా ఓ మోస్తరు అందగత్తే. తల్లి ఆశించినట్టుగానే సినిమాల్లోకి వచ్చింది. బాలీవుడ్‌లో ‘ధడక్’తో తెరకు పరిచయమైంది జాన్వీ. అయితే అక్కడ హిట్ పడక పోయేసరికి పాప కాస్త డీలా పడినా, సోషల్ మీడియాలో తెగ అందాలను ఆర బోస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తెలుగులో కూడా స్టార్ హీరోలను […]

  • By: krs    latest    Aug 03, 2023 12:57 PM IST
Janhvi Kapoor | అయ్యబాబోయ్.. సౌత్‌ మీద ఇంత ప్రేమా? నమ్మెదెలా జాన్వీ?

Janhvi Kapoor

విధాత‌: అందాల రాశి, దేవకన్య, అతిలోక సుందరి అయిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. తల్లి శ్రీదేవంత అందంగా లేకపోయినా జాన్వీ కపూర్ కూడా ఓ మోస్తరు అందగత్తే. తల్లి ఆశించినట్టుగానే సినిమాల్లోకి వచ్చింది. బాలీవుడ్‌లో ‘ధడక్’తో తెరకు పరిచయమైంది జాన్వీ.

అయితే అక్కడ హిట్ పడక పోయేసరికి పాప కాస్త డీలా పడినా, సోషల్ మీడియాలో తెగ అందాలను ఆర బోస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తెలుగులో కూడా స్టార్ హీరోలను అంత లేదు ఇంత లేదనే పొగడ్తలతో ముంచెత్తి మరీ ఛాన్స్‌లు కొట్టేస్తోంది.

ప్రస్తుతం తెలుగు తెరకు పరిచయమయ్యే క్రమంలో మొదటి చిత్రమే జూనియర్ ఎన్టీఆర్‌తో ‘దేవర’ మూవీ కావడంతో ఈజీగానే అమ్మడికి హైప్ వచ్చేసింది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ ఆగి.. ఇప్పుడు తెలుగు తెరపై నటించేందుకు వెనకున్న బలమైన కారణాన్ని చెప్పుకొచ్చింది. ఇంతవరకూ తెలుగులో చేయక పోవడానికి బలమైన కారణమంటూ ఏం లేదు. మంచి కథ దొరక్క మాత్రమే ఆగాను. నాకు నార్తే కాదు సౌత్ అన్నా చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.

సౌత్ ఇండస్ట్రీ సొంత ఇంటిలాగే అనిపిస్తుందని, ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందని చెబుతూ, ఇక్కడి వారి ప్రేమాభిమానాలు నాకు పూర్తిగా దక్కుతాయని నమ్ముతున్నానని, హైదరాబాద్ వస్తే సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుందని కూడా చెప్పింది. అందుకే ఇక్కడ సినిమాలు చేస్తున్నానని ఈ అమ్మడు సెలవచ్చింది. ఇదంతా తెలుగుపై మమకారం కాదుగానీ తెలుగు తెరపై తన జెండా పాతేందుకు పడుతున్న పాట్లని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకంటే ఇంతకు ముందు బాలీవుడ్‌లోనే చేస్తాను.. సౌత్ వైపు ఇప్పుడప్పుడే వచ్చే ఛాన్సే లేదని జాన్వీ, ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా చెప్పుకొచ్చారు. కానీ బాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోవడం, సినిమా ఇండస్ట్రీకి రారాజుగా టాలీవుడ్ మారడంతో.. జాన్వీ నిర్ణయం మార్చుకుంది. అందుకే ఇప్పుడీ భామ సౌత్‌పై తెగ ప్రేమ ఒలకబోస్తోంది. ఇప్పుడు శ్రీదేవి కూతురు తింగరి మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి.