Nizamabad: మారుమూల గ్రామాల్లోనూ స్పీడ్ గన్లు.. పేదలపై పెనాల్టీల భారం
అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారులు విధాత, నిజామాబాద్: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఇప్పటిదాకా పోలీసులు ప్రధాన రహదారులపైనే స్పీడ్ గన్లను అమర్చారు. ఇప్పుడు మారుమూల పల్లెల్లో సైతం స్పీడ్ గన్లను అమర్చుతున్నారు. తాజాగా బీబీపేట మండలం తూజాల్ పూర్ గ్రామంలో స్పీడ్ గన్ ను అమర్చారు. దీంతో సమీప గ్రామాల వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తూజాల్ పూర్ నుండి దుబ్బాక, సిద్దిపేట వెళ్లే సరిహద్దులో స్పీడ్ గన్ పాయింట్ పెట్టారు. ఇదే విషయాన్ని బీబీపేట ఎస్ఐ […]

- అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
విధాత, నిజామాబాద్: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఇప్పటిదాకా పోలీసులు ప్రధాన రహదారులపైనే స్పీడ్ గన్లను అమర్చారు. ఇప్పుడు మారుమూల పల్లెల్లో సైతం స్పీడ్ గన్లను అమర్చుతున్నారు. తాజాగా బీబీపేట మండలం తూజాల్ పూర్ గ్రామంలో స్పీడ్ గన్ ను అమర్చారు. దీంతో సమీప గ్రామాల వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తూజాల్ పూర్ నుండి దుబ్బాక, సిద్దిపేట వెళ్లే సరిహద్దులో స్పీడ్ గన్ పాయింట్ పెట్టారు. ఇదే విషయాన్ని బీబీపేట ఎస్ఐ సాయికుమార్ మండల ప్రజలకు తెలిపారు. ఇప్పటి వరకు బాన్స్‌వాడ, బోధన్, లింగంపేట ప్రాంతాలు, 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆర్మూర్ ప్రాంతంతో పాటు భిక్కనూరు టోల్ గేట్ సమీపంలో స్పీడ్ లెజర్ మిషన్ లను ఏర్పాటు చేశారు.
ఇది జాతీయ రహదారి డివైడర్ పై ఉన్నందున వాహనదారులకు కనిపించే విధంగా ఉండడం వల్ల పరిమిత వేగంతో వెళ్తూ వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిమితికి మించి వేగంతో వెళ్లే వాహనాలకు చలాన్లు తప్పడం లేదు. జిల్లాలో ఏర్పాటు చేసిన స్పీడ్ లెజర్ మిషన్లను పెట్టుకొని పోలీస్ కానిస్టేబుళ్లు చెట్లు, పొదలమాటున ఉండడం వల్ల వాహనదారులు వాటిని గుర్తించలేక పోతున్నారు. దీంతో ఇంటికి చేరేలోపే పెనాల్టీ మెసేజ్ వచ్చేస్తుంది.
మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఈ స్పీడ్ లెజర్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు అంటున్నారు. వీటి చలాన్లు తడిసి మోపెడు అవుతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త మండలాలు ఏర్పడిన నాటి నుండి పోలీసులకు పనిభారం తగ్గడంతో త్రిబుల్ రైడింగ్, వాహనాలకు సంబంధించిన ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ లను పరిశీలించడం, హెల్మెట్ లేని వారికి పెనాల్టీలు వేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిన్న గ్రామాలను సైతం మండల కేంద్రాలుగా మార్చడం వల్ల సమీపంలోని పొలాలకు వెళ్లే వారికి పోలీసులు నిర్వహించే వాహనాల తనిఖీలు ఇబ్బందిగా మారాయి. ఇదే సమయంలో మరీ మారు మూల ప్రాంతాల్లో సైతం స్పీడ్ లెజర్ మిషన్లను ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.