Peda Kapu | సహనం నశించిందా శ్రీకాంత్ అడ్డాల.. ఏందయ్యా ఈ అరాచకం?
Peda Kapu విధాత: శ్రీకాంత్ అడ్డాల పేరు చెబితే గుర్తొచ్చే సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమాతో పాటు దీనికి ముందు చేసిన కొన్ని సినిమాలతో ఆయన సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు పొందాడు. కానీ ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో ఆయనపై ఎక్కడా లేని, అప్పటి వరకు రాని నెగిటివిటీ వచ్చేసింది. మహేష్ బాబుతో మళ్లీ మ్యాజిక్ చేస్తాడని అనుకుంటే.. పరమ బోరింగ్ సినిమా తీసి ఫ్యాన్స్‌తో కూడా చివాట్లు తిన్నాడు. అప్పటి నుంచి శ్రీకాంత్ అడ్డాల […]

Peda Kapu
విధాత: శ్రీకాంత్ అడ్డాల పేరు చెబితే గుర్తొచ్చే సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమాతో పాటు దీనికి ముందు చేసిన కొన్ని సినిమాలతో ఆయన సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు పొందాడు. కానీ ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో ఆయనపై ఎక్కడా లేని, అప్పటి వరకు రాని నెగిటివిటీ వచ్చేసింది. మహేష్ బాబుతో మళ్లీ మ్యాజిక్ చేస్తాడని అనుకుంటే.. పరమ బోరింగ్ సినిమా తీసి ఫ్యాన్స్‌తో కూడా చివాట్లు తిన్నాడు.
అప్పటి నుంచి శ్రీకాంత్ అడ్డాల పేరు క్రమక్రమంగా ఇండస్ట్రీలో వినిపించడం తగ్గిపోయింది. మొన్నీ మధ్య మళ్లీ ‘నారప్ప’ అంటూ.. తమిళ సినిమా రీమేక్‌తో కాస్త పేరు వినిపించేలా చేసుకున్నా.. అది ఓటీటీలో విడుదల కావడంతో.. ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయినా సరే.. పట్టువదలని విక్రమార్కుడిలా.. ప్రయత్నం చేస్తూ.. ఇప్పుడు ‘పెదకాపు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ చాలా సెన్సిబుల్‌గా నడిచాయి. కానీ.. ఆ ట్యాగ్‌తో కొన్నాళ్లుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న శ్రీకాంత్ అడ్డాలలో సహనం నశించినట్లుంది. అందుకే ఈసారి ఫ్యాక్షన్ మిక్స్ చేసి యాక్షన్‌లోకి దిగాడు. మాస్ డైరెక్టర్‌గానూ మెరిపించగలననే ధీమాని టీజర్‌తోనే ఇచ్చేశాడు.
తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పెదకాపు 1’ టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో ఫ్యాక్షన్‌కు మించిన యాక్షన్‌ని శ్రీకాంత్ అడ్డాల లోడ్ చేసినట్లుగా.. టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా.. శ్రీకాంత్ అడ్డాల కూడా ఇందులో ఓ కీలక పాత్ర చేయడం విశేషం.
టీజర్ విషయానికి వస్తే.. ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ఇస్తున్న రాజకీయ ప్రసంగంతో ఈ టీజర్‌ని ప్రారంభించారు. ఆ ఊరికి రెండే దిక్కులు అంటూ.. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల ఆధిపత్యం ఉన్న గ్రామంలో.. ఒక సాధారణ వ్యక్తి పాలనను చేపట్టడం అనేది ఈ చిత్ర కథాంశంగా తెలుస్తుంది. ఈ ఇద్దరి మధ్య చావు తప్ప గ్రామస్తులకు వేరే మార్గం లేదనేలా ప్రజంట్ చేస్తూ చూపించిన సన్నివేశాలు సరికొత్తగా అనిపిస్తున్నాయి.
మరీముఖ్యంగా ఒక తాటిచెట్టుని జనాలంతా పట్టుకొచ్చే సీన్.. టీజర్‌కి హైలెట్ అనేలా ఉంది. అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే కథతో శ్రీకాంత్ అడ్డాల ఈసారి స్ట్రాంగ్‌గా అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా.. టీజర్‌లోని ప్రతి సన్నివేశం ఎలివేట్ అవుతోంది. గోపీచంద్ ‘యజ్ఞం’ తరహాలో ఒక సాధారణ వ్యక్తి.. రెండు పవర్ ఫుల్ శక్తులకు వ్యతిరేకంగా చేసిన పోరాటమే ఈ సినిమా అనేది ఈ టీజర్ క్లారిటీ ఇస్తుంది. డైలాగ్స్ కూడా కొత్తగా ఉన్నాయి.
మొత్తంగా అయితే.. ఈసారి శ్రీకాంత్ అడ్డాల విసిరే పంజా.. మాములుగా ఉండదనేది మాత్రం ఈ టీజర్‌తో తెలిసిపోతుంది. కాగా.. బాలయ్యతో ‘అఖండ’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి.. తన ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఛోటా కె నాయుడు కెమెరా, మిక్కీ జె మేయర్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్‌గా ఉండబోతున్నాయనేది కూడా ఈ టీజర్‌తోనే తెలిసిపోతోంది.