AP Sticker War | ఆంధ్రాలో స్టిక్కర్ వార్.. మా నమ్మకం నువ్వే జగన్‌కు కౌంటర్లు
టీడీపీ, జనసేన స్టిక్కర్లు సిద్ధం విధాత: ఆంధ్రాలో కౌంటర్ యుద్ధం (AP Sticker War) స్టార్ట్ చేసారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులూ చేపట్టిన ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దాదాపు ఐదు కోట్ల మంది ప్రజలను నేరుగా కలిసే ఈ కార్యక్రమం ద్వారా తమకు మంచి మేలు, ప్రజా మద్దతు దక్కుతుందని జగన్ భావించి తన శ్రేణులను రంగంలోకి దించారు. ఇందులో భాగంగా తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి […]

- టీడీపీ, జనసేన స్టిక్కర్లు సిద్ధం
విధాత: ఆంధ్రాలో కౌంటర్ యుద్ధం (AP Sticker War) స్టార్ట్ చేసారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులూ చేపట్టిన ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దాదాపు ఐదు కోట్ల మంది ప్రజలను నేరుగా కలిసే ఈ కార్యక్రమం ద్వారా తమకు మంచి మేలు, ప్రజా మద్దతు దక్కుతుందని జగన్ భావించి తన శ్రేణులను రంగంలోకి దించారు.
ఇందులో భాగంగా తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు ప్రజలకు చెబుతూ వారి ఇంటికి ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే స్టిక్కర్ ను అంటిస్తారు. ఇంకా అక్కడినుంచే వారి మొబైల్ నంబర్ తో ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఓ మిస్డ్ కాల్ ఇచ్చే ప్రక్రియ కూడా ఇందులో ఉంటుంది.
అయితే దీనికి కౌంటర్ గా టిడిపి, జనసేన కార్యకర్తలు సైతం ప్రతి ఇంటికీ వెళ్లి మా చంద్రబాబు మాట ఇస్తారు.. నిలబడతారు అంటూ స్టిక్కర్లు వేస్తున్నారు. జనసేన వారు సైతం మెం జగన్ను నమ్మం… పవన్ను నమ్ముతాం అంటూ స్టికర్లు అతికిస్తున్నారు. మొత్తానికి ప్రతి ఇంటికి మూడేసి పోష్టర్లు పడిపోతున్నాయి.
జగన్ పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు, దాని ప్రభావం ప్రజలమీద పడకుండా ఉండడానికి ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా జగన్ చేపట్టిన ఈ ప్రచారం జనాల్లోకి బాగానే వెళ్లిందని పార్టీ హై కమాండ్ సంబర పడుతోంది.
తాము ఈ నాలుగేళ్లుగా చేపట్టిన పథకాలు. సంక్షేమాలు అన్నీ వివరిస్తూ వెళ్లడం ద్వారా నేరుగా ప్రజలను కలిసినట్లు ఉంటుందని, తద్వారా మంచి మద్దతు దక్కుతుందని వారు అంటున్నారు. మరోవైపు టిడిపి జనసేన వాళ్ళు కూడా అదే జోరుగా ఇళ్లకు వచ్చి స్టిక్కర్స్ వేస్తున్నారు.