ప్రాక్టికల్స్ జరుగుతుండగా.. ఇన్విజిలేటర్‌పై కత్తితో దాడి
Delhi | ఓ విద్యార్థి భయానక వాతావరణాన్ని సృష్టించాడు. ప్రాక్టికల్స్ జరుగుతుండగానే.. ఇన్విజిలేటర్‌పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని ఇంద్రపురి ఏరియాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రపురి ఏరియాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి విద్యార్థులకు ప్రాక్టికల్స్ కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు భూదేవ్ ఇన్విజిలేటర్‌గా వచ్చారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి.. భూదేవ్తో వాగ్వాదానికి దిగాడు. అంతలోనే తన వద్ద ఉన్న కత్తితో […]

Delhi | ఓ విద్యార్థి భయానక వాతావరణాన్ని సృష్టించాడు. ప్రాక్టికల్స్ జరుగుతుండగానే.. ఇన్విజిలేటర్‌పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని ఇంద్రపురి ఏరియాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రపురి ఏరియాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి విద్యార్థులకు ప్రాక్టికల్స్ కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు భూదేవ్ ఇన్విజిలేటర్‌గా వచ్చారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి.. భూదేవ్తో వాగ్వాదానికి దిగాడు. అంతలోనే తన వద్ద ఉన్న కత్తితో ఉపాధ్యాయుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు విద్యార్థి.
అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది.. భూదేవ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టీచర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భూదేవ్పై కత్తితో దాడి చేసిన విద్యార్థిని పోలీసులు అరెస్టు చేసి, జువైనల్ హోంకు తరలించారు. ఈ దాడితో మరో ఇద్దరు విద్యార్థులకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.