ఇదేం ఘోరం: ఇంటర్ విద్యార్థినికి బస్టాండ్‌లోనే తాళి కట్టేశాడు.. వీడియో వైరల్
విధాత: ఓ ఇద్దరు విద్యార్థులు బస్టాండ్‌లోనే పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో వెలుగు చూసింది. యువతి పక్కన కూర్చున్న యువకుడు.. తన జేబులో నుంచి తాళి తీసి.. ఆమె మెడలో కట్టేశాడు. ఇక ఆ యువతి ముసి ముసి నవ్వులతో మురిసిపోయింది. ఆ యువకుడు కూడా ఏ మాత్రం భయపడకుండా.. అందరూ చూస్తుండగానే తాళి కట్టేశాడు. ఈ సమయంలో వారిద్దరిని అక్కడున్న కొంతమంది ఫ్రెండ్స్ ప్రోత్సహించారు. అంతేకాదు.. ఆ విద్యార్థులపై పూలు చల్లి […]

విధాత: ఓ ఇద్దరు విద్యార్థులు బస్టాండ్‌లోనే పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో వెలుగు చూసింది. యువతి పక్కన కూర్చున్న యువకుడు.. తన జేబులో నుంచి తాళి తీసి.. ఆమె మెడలో కట్టేశాడు. ఇక ఆ యువతి ముసి ముసి నవ్వులతో మురిసిపోయింది.
ఆ యువకుడు కూడా ఏ మాత్రం భయపడకుండా.. అందరూ చూస్తుండగానే తాళి కట్టేశాడు. ఈ సమయంలో వారిద్దరిని అక్కడున్న కొంతమంది ఫ్రెండ్స్ ప్రోత్సహించారు. అంతేకాదు.. ఆ విద్యార్థులపై పూలు చల్లి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ దృశ్యాలను అక్కడున్న కొంత మంది తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియో పోలీసుల దాకా చేరడంతో సీరియస్‌గా స్పందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వీడియోలో కనిపించిన యువకుడు(17) పాలిటెక్నిక్ చదువుతున్నాడు. యువతి(16) ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.