హిజాబ్‌పై ఎటూ తేల్చ‌ని సుప్రీంకోర్టు

విధాత‌, ఢిల్లీ: హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఎటూ తేల్చ‌లేదు. ఈ వివాదంపై సుప్రీం ధ‌ర్మాస‌నం భిన్నాభిప్రాయాల‌తో తీర్పు వెలువ‌రించింది. ఇద్ద‌రు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. జ‌స్టిస్ హేమంత్ గుప్తా హైకోర్టు తీర్పును స‌మ‌ర్థించగా, జ‌స్టిస్ సుధాన్షు ధులియా హైకోర్టు తీర్పును ప‌క్క‌న‌పెట్టారు. కాగా.. ఆర్టిక‌ల్ 14, 19 ప్ర‌కారం క‌ర్ణాట‌క హైకోర్టు తీర్పు చెల్ల‌ద‌ని జస్టిస్ ధులియా స్ప‌ష్టం చేశారు. విద్యార్థినులు చ‌దువుల‌కే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల‌ని పేర్కొన్నారు. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ ఉత్త‌ర్వును ధులియా […]

హిజాబ్‌పై ఎటూ తేల్చ‌ని సుప్రీంకోర్టు

విధాత‌, ఢిల్లీ: హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఎటూ తేల్చ‌లేదు. ఈ వివాదంపై సుప్రీం ధ‌ర్మాస‌నం భిన్నాభిప్రాయాల‌తో తీర్పు వెలువ‌రించింది. ఇద్ద‌రు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. జ‌స్టిస్ హేమంత్ గుప్తా హైకోర్టు తీర్పును స‌మ‌ర్థించగా, జ‌స్టిస్ సుధాన్షు ధులియా హైకోర్టు తీర్పును ప‌క్క‌న‌పెట్టారు.

కాగా.. ఆర్టిక‌ల్ 14, 19 ప్ర‌కారం క‌ర్ణాట‌క హైకోర్టు తీర్పు చెల్ల‌ద‌ని జస్టిస్ ధులియా స్ప‌ష్టం చేశారు. విద్యార్థినులు చ‌దువుల‌కే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల‌ని పేర్కొన్నారు. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ ఉత్త‌ర్వును ధులియా ర‌ద్దు చేశారు. అంశాన్ని సీజేఐ ధ‌ర్మాససానికి బ‌దిలీ చేస్తున్న‌ట్లు జ‌స్టిస్ హేమంత్ గుప్తా వెల్ల‌డించారు.

క‌ర్ణాట‌క విద్యాసంస్థ‌ల్లో యువ‌తులు హిజాబ్ ధ‌రించ‌డంపై ఉన్న నిషేధాన్ని తొలిగించడం కుద‌ర‌ద‌న్న ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. జ‌స్టిస్ హేమంత్ గుప్తా, సుధాంశు ధూలియాల ధ‌ర్మాస‌నం ఈ వివాదంపై ప‌దిరోజుల పాటు వాద‌న‌లు విన్న‌ది. దీనిపై తీర్పును రిజ‌ర్వులో ఉంచుతూ అత్యున్న‌త న్యాయ‌స్థానం సెప్టెంబ‌ర్ 22న ఉత్త‌ర్వులు వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే.