పిల్లా అంటూ చీరకట్టులో ఉడికిస్తున్న సురేఖా వాణి.. ఈ వయస్సులోను!

సురేఖా వాణి.. తెలుగు సినిమాల్లో తల్లి, కోడలు, భార్య పాత్రల్లో మెరుస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు సురేఖా వాణి ప్రతి సినిమాలో కనిపించేది. కాని ఇప్పుడు ఎందుకో అవకాశాలు పెద్దగా రావడం లేదు. సురేఖా ఎక్కువగా, బ్రహ్మనందం లాంటీ కమెడీయన్స్ పక్కన నటిస్తూ మంచి గుర్తింపు అందుకుంది. ఈ మధ్యన సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. పొట్టి దుస్తులలో నానా రచ్చ చేస్తుంది. కూతురు సుప్రీతతో కలిసి సామాజిక మాధ్యమాల్లో ఈ అమ్మడు చేస్తున్న రచ్చ పీక్స్ లో ఉంది. కొన్నిసార్లు ఆమె ఫొటోలు, వీడియోలపై ట్రోలింగ్ వచ్చినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా రచ్చ చేస్తూనే ఉంటుంది.
కొన్నేళ్ల క్రితం సురేఖా వాణి భర్త అనారోగ్యంతో కన్నుమూయగా, ఆయనని చాలా మిస్ అవుతున్నట్టు పలు సందర్భాలలో చెప్పుకొస్తుంటుంది. అయితే సురేఖా వాణి నాలుగు పదుల వయసు దాటిపోయినా.. అందంలో మాత్రం తన కూతురుతో పోటీ పడుతూ అదరగొడుతూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో హోయలు పోతూ పిల్లా భూ లోకం కన్నుగీటి అనే సాంగ్‌కి సందడి చేసింది. విరహంతో సురేఖా వాణి చేసిన రచ్చ కుర్రాళ్లని కుదరుగా ఉండనివ్వడం లేదు. ఈ అమ్మడు హోయలు పోతున్న విదానం చూసి అందరు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు.
సురేఖావాణికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆమెను ఆరు లక్షలకు పైగా ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. అంతేకాదు సురేఖా వాణికి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉండగా, అందులో తన కూతురు సుప్రీతతో కలిసి వీడియోలు చేస్తూ.. పంచుకుంటారు. ఇలా ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు ఇక్కడ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. సినిమాలు చేయకపోయిన కూడా సోషల్ మీడియాతో మాత్రం ఎప్పుడు వినోదం పంచుతూనే ఉంది.